25.2 C
Hyderabad
September 20, 2026
ఖమ్మంహోమ్

భూదాన్ భూ బాధితులకు నేడు పట్టాల పంపిణీ

#BhudanLand

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలో భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన అర్హులైన పేదలకు నేడు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన కూల్చివేతల నేపథ్యంలో ప్రభుత్వం బాధితులకు ప్లాట్లు కేటాయించి ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్మించిన దాదాపు 700 పేదల ఇళ్లను పది రోజుల క్రితం అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందించి బాధితులకు అండగా నిలిచి ధర్నాలు, నిరసనలు నిర్వహించాయి. కూల్చివేతలపై ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది.

ఈ నేపథ్యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు కోల్పోయిన వారిలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్లాట్లు కేటాయించి ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా కూల్చివేతలు జరిగిన ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు పోలీసుల పహారా మధ్య శిధిలాలను తొలగిస్తున్నారు. పదుల సంఖ్యలో ప్రోక్లైనర్లు, వందలాది ట్రాక్టర్లు, టిప్పర్ల సహాయంతో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. బాధితులకు పట్టాలు పంపిణీకి ముందుగా స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసే పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Related posts

శ్రీశైలంలో భారీ గా పెరిగిన భక్తుల రద్దీ

Satyam News

కార్యకర్తలకు గుర్తింపునిచ్చే పార్టీ  టీడీపీ

Satyam News

రబీ రైతు భరోసా కోసం రాహుల్ గాంధీ కి వినతి

Satyam News

అమెరికా ఇరాన్ అవగాహనను స్వాగతించిన భారత్

Satyam News

చండ్ర రాజేశ్వరరావు ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకం

Satyam News

బోనాల ఉత్సవానికి గవర్నర్ కు ఆహ్వానం

Satyam News

Leave a Comment