25.2 C
Hyderabad
September 20, 2026
కడపహోమ్

కుక్కలు కాదు.. పిచ్చి కుక్కలు…. షర్మిల ఎదురుదాడి….!!

#YSSharmila

జగనన్న జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదంటున్నారు. ఏపీ కాంగ్రెస్‌ ఛీఫ్‌ షర్మిల. తనపై విమర్శలు చేస్తే మాత్రం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వివేకా హత్య కేసు విషయంలో సునీతకు సపోర్టుగా మాట్లాడిన షర్మిల.. జగన్‌ని గట్టిగా టార్గెట్‌ చేశారు. ఇలాంటి అన్న ఉంటే శతృవులు అవసరం లేదని.. అన్న అనే పేరుకే కళంకం తెచ్చావని… ఘాటుగా వ్యాఖ్యానించారు. అమె కామెంట్స్‌తో రగిలిపోయిన వైసీపీ నాయకులు ఆస్తుల వ్యవహారంపై మాట్లాడటంతో.. వైఎస్సార్ సతీమణి విజయమ్మ నోటరీ చేసిన లేఖ విడుదల చేశారు. చెల్లికి అన్యాయం చేశావని సొంత తల్లే చెప్పడం జగన్‌కి మరింత ఇబ్బందికరంగా మారింది.

ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల.. ప్రభుత్వం కంటే.. జగన్‌నే ఎక్కువ టార్గెట్‌ చేస్తున్నారంటూ.. బ్లూ మీడియా ఏడుపులు ప్రారంభించింది. వైసీపీ మీడియాలో వస్తున్న కథనాలతో షర్మిల వ్యూహం మార్చుకొన్నట్లు కనిపిస్తోంది. అధికారం పోయిన తర్వాత వైసీపీ నాయకులకు.. పార్టీ అధినేత జగన్‌కు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది.

అనేక విషయాల్లో క్షేత్రస్థాయిలో కేడర్‌ అభిప్రాయం ఒకరకంగా ఉంటే.. జగన్‌ నిర్ణయాలు మరో విధంగా ఉంటున్నాయి. రీసెంట్‌గా నియోజకవర్గాల పునర్విభజన, ఏపీలో ఎమ్మెల్యే.. ఎంపీ సీట్లు పెంచడం వైసీపీకి నష్టమని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తుంటే.. బ్లూ మీడియా సీట్లు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కథనాలు ప్రచారం చేస్తోంది. జగన్‌ మాత్రం ఇది మంచి అవకాశం అని చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా జగన్‌ మాట్లాడరని అందరికీ తెలుసు.

ఈ బలహీతను ఉపయోగించుకొని.. వైసీపీ క్యాడర్‌ను కాంగ్రెస్‌ వైపు తిప్పుకోవాలని షర్మిల ఆలోచనగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం కంటే జగన్‌నే ఎక్కువ టార్గెట్‌ చేస్తున్నారని వస్తున్న ఆరోపణలు రాజకీయంగా షర్మిలకు మైనస్ అవుతాయి. అందుకే వ్యూహాత్మకంగా ఈ మధ్య ఏపీ సర్కారు మీద విమర్శల డోసు పెంచారు.

అంతటితో ఆగకుండా.. జగన్‌ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని నేరుగా వైసీపీ కార్యకర్తలకు స్పష్టత ఇచ్చారు. తనపై విమర్శలు చేస్తేనే స్పందిస్తాను తప్ప.. పని గట్టుకొని జగన్‌ని టార్గెట్‌ చేయడం లేదని వివరించారు. ఇదంతా చూస్తే.. జగన్‌లా మొండిగా వెళ్లకుండా.. షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వస్తోంది. ఈ లెక్కన రాజకీయంగా జగన్‌ కంటే షర్మిల నాలుగు మెట్లు పైనే ఉన్నారని అర్ధమవుతోంది. వైసీపీ కార్యకర్తలు.. షర్మిలే బెటర్ అనే ఒపీనియన్‌కి వస్తే.. జగన్‌కి కష్టాలు తప్పవు.

Related posts

‘పోలీస్ కంప్లైంట్’ చిత్ర యూనిట్‌ను అభినందించిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

Satyam News

ముగ్గురు అమ్మాయిలు ఆంధ్రా పేరును నిలబెట్టారు!

Satyam News

శ్రీశైలం దేవస్థానం హుండీ ఆదాయం రూ.5 కోట్ల పైనే

Satyam News

ఆసుపత్రిలో అగ్గి: ముగ్గురు నవజాత శిశువల మృతి

Satyam News

దాససాహిత్య గాయకులకు టీటీడీ నుంచి సువర్ణావకాశం

Satyam News

న్యూయార్క్ లో తెలంగాణ జానపద పండగ

Satyam News

Leave a Comment