29.2 C
Hyderabad
September 20, 2026
మహబూబ్ నగర్హోమ్

హైదరాబాద్ నుంచి సోమశిల కు హెలికాప్టర్

సోమశిల గ్రామంలోని కృష్ణానది అందాలతో పాటుగా శ్రీశైలం వరకు హైద్రాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా పర్యాటకులకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలి టూరిజం సేవలను ఈ నెల 9 వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నారు.అందులో భాగంగా సోమశిల లో జరుగుతున్న హెలిప్యాడ్ పనులను నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ నేడు పరిశీలించారు.

పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కృషితో సోమశిల గ్రామంతో పాటుగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎన్నో ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రదేశాలు పర్యాటకులను మరింతగా ఆకర్షించి ఆయా గ్రామాల ప్రజల జీవనోపాధికి దోహదపడుతున్నాయి. పర్యాటక రంగంలో మంత్రి జూపల్లి గారు చేస్తున్న ఎనలేని కృషి ఆయా గ్రామాల ప్రజలతో పాటు కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు కూడా హర్షిస్తున్నారు.

Related posts

నవ మల్లెతీగ మంత్లీ మ్యాగజైన్ ఆవిష్కరణ

Satyam News

రెండు పెళ్లిళ్లు..సహజీవనం..అక్రమ సంబంధం..చివరకు మర్డర్

Satyam News

కల్తీ ఆహార పదార్ధాలను పట్టుకున్న పోలీసులు

Satyam News

సిరి మీడియా అక్రమాలపై దాసరి కుమారుడి ఫిర్యాదు

Satyam News

ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

Satyam News

ఫిలిం ఫెడరేషన్ కు భవనం నిర్మించి ఇస్తా:చదలవాడ

Satyam News

Leave a Comment