26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

కల్పవృక్ష వాహనంపై శ్రీ వేదనారాయణ స్వామి

#SriVedanarayanaSwamy

నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో స్వామివారు భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా జరిగింది.

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కల్పవృక్షం కోరుకున్న వరాలను ప్రసాదించే దివ్య వృక్షంగా పరిగణించబడుతుంది. దాని నీడలో ఆశ్రయించిన వారికి శాంతి, సంతృప్తి కలుగుతాయని ఆధ్యాత్మిక భావన. ఈ వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related posts

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Satyam News

జగన్ ముందు అమరావతి పెట్టిన మరో పరీక్ష

Satyam News

కెసిఆర్ అప్పులన్నీ అభివృద్ధికి పెట్టుబడులే..

Satyam News

హై స్పీడ్ రైల్‌ నెట్‌వర్క్‌ హబ్‌గా ఏపీ

Satyam News

31 దేశాల కంపెనీలు.. లక్షన్నర ఉద్యోగాలు… ఏపీలో మెగా జాబ్‌ సెంటర్‌!

Satyam News

జాత్యహంకారంతో సిక్కు యువతిపై అత్యాచారం

Satyam News

Leave a Comment