32.2 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

Final: విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

#VijayTVK

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడే కీలక పరిణామం చోటుచేసుకుంది. VCK అధికారికంగా TVK కు మద్దతు ప్రకటించడంతో నటుడు-రాజకీయ నాయకుడు విజయ ప్రభుత్వం ఏర్పాటు దిశగా మరింత బలంగా ముందుకు సాగుతున్నారు.

వీసీకే అధ్యక్షుడు తిరుమావలవాన్, టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధ్యవ్ అర్జునా కలిసి అధికారిక మద్దతు లేఖ అందజేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన కీలక సంఖ్యాబలం టీవీకేకు లభించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

234 సభ్యుల తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని ప్రకటిస్తూ విజయ్ గవర్నర్ రాజేంద్ర అక్లేకర్ ను మరోసారి కలిసి ప్రభుత్వం ఏర్పాటు కోసం అనుమతి ఇవ్వాల్సిందిగా కోరనున్నారు.

మీడియాతో మాట్లాడిన ఆధ్యవ్ అర్జునా, వీసీకే మద్దతు లేఖను ప్రదర్శిస్తూ “విజయం” అంటూ ప్రకటించడం రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది. గత మూడు రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠభరిత చర్చలు, మద్దతుల రాజకీయాలకు ఈ పరిణామం కీలక ముగింపుగా భావిస్తున్నారు.

ఇప్పటి వరకు వీసీకే తమ మద్దతుపై స్పష్టత ఇవ్వకుండా ఉండటం వల్ల అనేక ఊహాగానాలు వినిపించాయి. నేపథ్యంలో తీవ్ర స్థాయి రాజకీయ చర్చలు, ఒత్తిళ్లు, బేరసారాలు జరిగినట్లు ప్రచారం సాగింది. అయితే చివరకు వీసీకే అధికారిక మద్దతు ప్రకటించడంతో టీవీకే శిబిరంలో ఆనంద వాతావరణం నెలకొంది.

ఇక రాజ్ భవన్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు టీవీకేకు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు భావించబడింది. అందులో టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, సీపీఐ మరియు సీపీఎం పార్టీలకు చెందిన ఇద్దరు చొప్పున సభ్యుల మద్దతు ఉన్నట్లు సమాచారం. వీసీకే మద్దతుతో ఆ సంఖ్య 118కు చేరినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ పరిణామాల మధ్య ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అమ్మ మక్కల్ మునేత్ర కజగం పార్టీ ఆరోపణలు చేసింది. అయితే టీవీకే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.

ఇంకా తమిళనాడుకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించినట్లు వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు ముందు మద్దతు సంఖ్యను కాపాడుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వీసీకే అధికారిక మద్దతుతో ఇప్పుడు తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది. దీంతో విజయ్ రాజకీయ ప్రయాణంలో ఇది అత్యంత కీలక ఘట్టంగా మారింది.

Related posts

‘ఆత్మరక్షణ’ పేరుతో మళ్లీ అమెరికా దాడులు

Satyam News

మీడియా ఫ్రంట్‌ పేజీలో.. పేద పిల్లల ఫోటోలు.. లోకేశ్‌ సూపర్‌!

Satyam News

అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

Satyam News

మిరాకిల్ చేద్దాం రండి అంటున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్

Satyam News

నారా లోకేష్ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్

Satyam News

అమరావతిలో వర్చువల్‌ స్టూడియోలు…. మల్టీ మీడియాలో లక్షన్నర జాబ్స్..!!

Satyam News

Leave a Comment