26.3 C
Hyderabad
September 19, 2026
విశాఖపట్నంహోమ్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

#chandra

విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు వచ్చిన సమాచారం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాద ఘటనపై వెంటనే ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులు, గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సహాయం, సహాయక చర్యల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక బృందాలు చేపడుతున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సీఎం చంద్రబాబు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించడంతో పాటు, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక శాఖలతో పాటు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి సహాయక కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాధితులకు సహాయం అందించడంతో పాటు ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Related posts

సింగరేణిలో సహజ మరణానికి కూడా 10 లక్షల ఉచిత బీమా

Satyam News

IGGAARL ను సందర్శించిన జర్మన్ ఫెడరల్ ప్రభుత్వ అంబాసిడర్

Satyam News

భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ

Satyam News

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌….!!

Satyam News

పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Satyam News

ఎండలతో పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు

Satyam News

Leave a Comment