25.2 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

వైద్య హబ్‌గా తెలంగాణ : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

#TelanganaAssembly

శేరిలింగంపల్లిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీప నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేసిన ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, సమాజంలో వైద్యులకు ప్రత్యేక గౌరవం ఉంటుందని పేర్కొన్నారు.

దేశంలో వైద్య రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని, అధునాతన సాంకేతిక పరికరాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసుపత్రులు ఏర్పాటు కావడం ఆనందదాయకమని అన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి కూడా అనేక మంది చికిత్స కోసం భారతదేశానికి వస్తున్నారని తెలిపారు.

ఈ ఆసుపత్రి ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందాలని, సంస్థ మరింత విస్తరించి ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.

అనంతరం డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి చౌకగా, సకాలంలో వైద్యం అందాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందరికీ అందుబాటులో వైద్య సేవలు అందించడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.

వైద్యులు తమ సామాజిక బాధ్యతను గుర్తించి పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

రెండో వివాహం చేసుకున్న నటి సమంత

Satyam News

డీలిమిటేషన్ అర్ధం లేని చర్య

Satyam News

పహల్గామ్ ఉగ్రదాడి హఫీజ్ సయీద్‌ చేయించిందే…

Satyam News

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం

Satyam News

వంటగ్యాస్ బ్లాక్ మార్కెట్: భూమన అనుచరుడు పరార్

Satyam News

తెలుగు ఇండస్ట్రీకి మరో యువ హీరో దొరికాడు

Satyam News

Leave a Comment