విజయనగరంహోమ్

గిరిజన విద్యార్ధులకు అండగా మంత్రి నారా లోకేష్

#KuridiVillage

విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలం కురిడి గ్రామ గిరిజన పిల్లల విద్యా సమస్యకు ప్రభుత్వం వేగంగా స్పందించింది. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేక చిన్నారులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి రావడంతో పాటు పలువురు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని గుర్తించిన డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ ఈ సమస్యను జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నెల రోజుల వ్యవధిలోనే సమస్యకు పరిష్కారం చూపుతూ కురిడి గ్రామంలో తాత్కాలిక ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఏర్పాటు చేసింది.

నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలను డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) జగదీశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, చిన్నారులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పాఠశాల తమ గ్రామంలోనే ప్రారంభం కావడంతో గిరిజన కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి.

ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్య ప్రతి చిన్నారికి ప్రాథమిక హక్కు అనే భావనతో ప్రభుత్వం పనిచేస్తోందని, ఎక్కడైనా విద్యా సౌకర్యాల లోపం ఉంటే వాటిని గుర్తించి వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు కూడా అదే సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు.

గ్రామానికి ప్రభుత్వ పాఠశాల అందుబాటులోకి రావడంతో ఇకపై గిరిజన విద్యార్థులు తమ గ్రామంలోనే విద్యను అభ్యసించే అవకాశం లభించిందని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం

Satyam News

ప్రభుత్వ డాక్టర్లపై దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు

Satyam News

పోలవరం ప్రాజెక్ట్ లో రెండో రోజు సి ఎస్ ఎం ఆర్ ఎస్ పరీక్షలు

Satyam News

2025 ఆసియా కప్ ఫైనల్: భారత్ ఘన విజయం

Satyam News

ప్రభుత్వ అధికారిని వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన మహిళ

Satyam News

అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌

Satyam News

Leave a Comment