జాతీయ ఉత్తమ నటుడుగా మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి ఎంపికయ్యారు. భారతీయ సినీ రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నేడు ప్రకటించింది.
2024 సంవత్సరంలో సెన్సార్ ధ్రువీకరణ పొందిన చిత్రాలను ఈ అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. దేశంలోని వివిధ భాషల్లో రూపొందిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, కథా రచయితలు, సంగీత దర్శకులు తదితర విభాగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారిని ఈ పురస్కారాలతో సత్కరించారు.
2024 సంవత్సరం ఉత్తమ నటుడి పురస్కారాన్ని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో పాటు బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ సంయుక్తంగా అందుకున్నారు. తమ తమ చిత్రాల్లో అద్భుతమైన నటనకు గాను జ్యూరీ ఈ ఇద్దరినీ ఎంపిక చేసింది. ఉత్తమ నటి పురస్కారం యామి గౌతమ్‌కు దక్కింది. ఆమె నటనకు విమర్శకులతో పాటు జ్యూరీ కూడా ప్రశంసలు కురిపించింది.
ప్రాంతీయ చిత్రాల విభాగంలో మలయాళ చిత్రం “ఫెమినిచి ఫాతిమా” ఉత్తమ మలయాళ చిత్రంగా ఎంపికైంది. వివిధ భారతీయ భాషల్లో రూపొందిన నాణ్యమైన చిత్రాలకు కూడా జాతీయ పురస్కారాలు ప్రకటించగా, భారతీయ సినీ వైవిధ్యం మరోసారి ఈ అవార్డుల ద్వారా ప్రతిఫలించింది.
జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ పురస్కారాలుగా గుర్తింపు పొందాయి. ఉత్తమ కథనం, నటన, దర్శకత్వం, సాంకేతిక నైపుణ్యం, సామాజిక సందేశం, ప్రాంతీయ సినీ ప్రతిభ వంటి అనేక విభాగాల్లో ప్రతిభను ప్రోత్సహించడం వీటి ప్రధాన ఉద్దేశం. ఈ ఏడాది కూడా వివిధ భాషలకు చెందిన చిత్రాలు, కళాకారులు అవార్డులు సాధించడం ద్వారా భారతీయ సినీ పరిశ్రమలోని సృజనాత్మక వైవిధ్యం మరోసారి వెలుగులోకి వచ్చింది.
జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలు :
ఉత్తమ తెలుగు చిత్రం – కమిటీ కుర్రోళ్లు
ఉత్తమప్రజాదరణ చిత్రం: కల్కి 2898 ఏడీ (నాగ్ అశ్విన్)
ఉత్తమ నటుడు(షేర్డ్): కార్తిక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్)
ఉత్తమ నటుడు (షేర్డ్): మమ్ముట్టి (భ్రమయుగం)
బెస్ట్ ఫిల్మ్:ఆర్టికల్ 370 (ఆదిత్య సుహాస్ జంబాలే)
ఉత్తమ నటి: యామి గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ దర్శకత్వం: అమరన్ (రాజ్కుమార్ పెరియసామి)
ఉత్తమ సహాయ నటి: మిథ్య (రూపశ్రీ వర్కాడే)
ఉత్తమ సహాయ నటి (షేర్డ్). మహారాజ (సచన నమిదాస్)
ఉత్తమ సహాయ నటుడు: భక్షక్ (సంయ్ మిశ్రా)
బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్: చిన్న కథ కాదు (నంద కిషోర్ ఇమాని)
బెస్ట్ నేషనల్, సోషల్, ఎన్విరామెంటల్ వాల్యూస్ ఫిల్మ్: కెప్టెన్ మిల్లర్ (అరుణ్ మాథేశ్వరన్)
బెస్ట్ డెబ్యూ ఫిల్మ్: స్వాతంత్య్ర వీర్ సావర్కర్ ( రణ్ప్ హుడా)
బెస్ట్ మేకప్: కమిటీ కుర్రాళ్లు: పి. రవికుమార్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: పుష్ప2 (దీపాలి నూర్, సీతల్ శర్మ)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: కల్కి 2898 ఏడీ( నితిన్ జిహానీ చౌదరి)
బెస్ట్ ఎడిటింగ్: అమరన్ (ఆర్ కలైవానన్)
బెస్ట్ సౌండ్ డిజైన్: భూల్ భూలయ్య 3 (హిందీ) మానస్ చౌదరి
బెస్ట్ స్క్రీన్ప్లే (సంభాషణలు): లక్కీ భాస్కర్ వెంకీ అట్లూరి
బెస్ట్ స్క్రీన్ప్లే (అడాప్టెడ్): స్వరగంధర్వ సుదిర్ ఫాడ్కే యోగేశ్ దేశ్పాండే
బెస్ట్ స్క్రీన్ప్లే (ఒరిజినల్): పుష్ప2 (సుకుమార్)
బెస్ట్ తమిళ్ ఫిల్మ్: రాయన్
బెస్ట్ ఒడియా ఫిల్మ్: లహరి
బెస్ట్ మరాఠీ ఫిల్మ్: ముక్కమ్ పోస్ట్ బొంబిల్ వాడి
బెస్ట్ మణిపురి ఫిల్మ్: సునిత
బెస్ట్ మలయాళం ఫిల్మ్: ఫెమినిచ్చి ఫాతిమా
బెస్ట్ కొంకణి ఫిల్మ్: మోగ్ ఆసుమ్
బెస్ట్ కన్నడ ఫిల్మ్: మిథియా
బెస్ట్ హిందీ ఫిల్మ్: శ్రీకాంత్
బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: మారన్
బెస్ట్ బెంగాలీ ఫిల్మ్: చలిచిత్ర ఎకోన్
