గుంటూరుహోమ్

పుట్టింటి ప‌ట్టుచీర‌ల‌తో వ‌నిత‌ల సంతోషం

సంద‌ర్భం ఏదైనా, ఎక్క‌డైనా మంగ‌ళ‌గిరి చేనేత‌ను ప్ర‌మోట్ చేయ‌డంలో ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ ముందుంటారు. మోదీని క‌లిసినా, బిట్ గేట్స్ షేక్ హ్యాండ్ ఇచ్చినా మంగ‌ళ‌గిరి చేనేత శాలువాతో స‌త్క‌రించి.. త‌న నియోజ‌క‌వ‌ర్గ చేనేత గొప్ప‌త‌నాన్ని వారికి వివ‌రిస్తారు.

చేనేత‌కు పూర్వ‌వైభ‌వం తీసుకొచ్చేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్న నారా లోకేష్‌…తాను ఇస్తున్న విందులోనూ మంగ‌ళ‌గిరి చేనేత‌కు ప్ర‌త్యేక ప్ర‌చారం క‌ల్పిస్తున్నారు. మ‌హిళ‌ల‌కు చీర‌లంటే ఎంత ఇష్ట‌మో చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌జాప్ర‌తినిధుల‌ను విందుకు ఆహ్వానిస్తోన్న లోకేష్ ..కుటుంబ‌స‌భ్యులైన మ‌హిళ‌ల‌కు మంగ‌ళ‌గిరి చీర‌లు కానుక‌గా అంద‌జేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబంగా భావించే టీడీపీ నేత‌ల కుటుంబ‌స‌భ్యులు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ఇచ్చిన మంగ‌ళ‌గిరి ప‌ట్టుచీర‌ల‌ను తమ పుట్టింటి వారు పెట్టిన చీర‌లుగా భావిస్తూ మురిసిపోతున్నారు.

గురువారం రాత్రి లోకేష్ ఇచ్చిన విందుకు హాజ‌రైన బాప‌ట్ల‌, ఒంగోలు పార్ల‌మెంటు నియోజ‌వర్గాల ప్ర‌జాప్ర‌తినిధులు కుటుంబ‌స‌భ్యులు లోకేష్ ఇచ్చిన మంగ‌ళ‌గిరి ప‌ట్టుచీర‌ల‌ను అమూల్య‌మైన కానుక‌గా తీసుకెళ్లారు.

Related posts

128 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్

Satyam News

ముందస్తు బెయిల్ కోసం ఖేరా యత్నం

Satyam News

సీఎం రేవంత్ కు ఆటా ప్రతినిధుల ఆహ్వానం

Satyam News

ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

Satyam News

ఆడుకుంటూనే… గుండెపోటుతో చిన్నారి….

Satyam News

20 నోటిఫికేషన్లు.. లక్ష జాబ్స్.. ఉగాదికి ఏపీలో ఉద్యోగాల జాతర

Satyam News

Leave a Comment