27.1 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై దాడులు తీవ్రం

గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, అమెరికన్ పెట్టుబడులు ఉన్న చమురు కంపెనీలే లక్ష్యంగా ఇరాన్ భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడులు ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందే ఇరాన్ ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది.

గల్ఫ్ దేశాల్లోని పోర్టులు, చమురు కర్మాగారాలు, అమెరికన్ మిలిటరీ బేస్‌లు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఇరాన్ సూచించింది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని దుబాయ్‌లో ఉన్న కీలకమైన జేబల్ ఆలీ పోర్ట్, అబుదాబీలోని ఖలీఫా పోర్ట్, మరియు ఫుజయిరా పోర్టులను తాము లక్ష్యంగా చేసుకోబోతున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది.

తన దేశానికి అత్యంత కీలకమైన ఆయిల్ నిక్షేప కేంద్రమైన ‘ఖర్గ్ ద్వీపం’పై ఎమిరేట్స్ భూభాగం నుంచే దాడి జరిగిందని ఇరాన్ తీవ్రంగా ఆరోపించింది. ఈ దాడిని ఏమాత్రం ఉపేక్షించబోమని, తమ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసినందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

ఎమిరేట్స్ సర్వనాశనానికి సిద్ధం కావాలని హెచ్చరిస్తూ ఇరాన్ తన క్షిపణి దాడులను ముమ్మరం చేయడంతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామం అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను మరియు గల్ఫ్ ప్రాంత భద్రతను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది.

 

Related posts

వైసీపీ లిక్కర్ దందా: జీతాలకు ఎసరు పెట్టి రూ. 400 కోట్లు స్వాహా!

Satyam News

భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా?

Satyam News

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ గూండాల దాడి

Satyam News

అమరావతిలో గ్లోబల్ లీడర్ షిప్ కేంద్రం

Satyam News

యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలి

Satyam News

కాకినాడ పరిసరాల్లో తీరం తాకే అవకాశం

Satyam News

Leave a Comment