26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

అసెంబ్లీ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

శాసనసభ ప్రాంగణంలో.. తెలంగాణ జాతి గౌరవం, నిరంతర స్పూర్తికి నిలువెత్తు ప్రతిబింబంగా, అస్తిత్వం, సంస్కృతికి ప్రతిరూపమైన శక్తి స్వరూపిణి “తెలంగాణ తల్లి” విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో కలిసి గవర్నర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజున జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ముందుగా ముఖ్యమంత్రి తో కలిసి గవర్నర్ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పునరుద్ధరించిన శాసనమండలి భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు.

Related posts

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట

Satyam News

ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

Satyam News

ఆన్ లైన్ బెట్టింగ్ ల కోసం మర్డర్… దారుణం

Satyam News

పవర్ ఫుల్ పవన్ కల్యాణ్ దృష్టి ఇక ఎర్రచందనం పైనే…

Satyam News

మహా మనిషిని సైతం వేధించిన జగన్ రెడ్డి

Satyam News

కేరళలో ఫీజుల పెంపుపై విద్యార్ధుల నిరసన

Satyam News

Leave a Comment