ప్రత్యేకంహోమ్

అలీ లారిజానీ అంతిమ యాత్రలో కోట్లాది మంది….

#AliLarijani

ఇజ్రాయిల్ దాడిలో మరణించిన ఇరాన్‌ ప్రముఖ నాయకుడు అలీ లారిజానీ అంతిమ యాత్రకు లక్షలాది మంది హాజరయ్యారు. భావోద్వేగ వాతావరణంలో కొనసాగిన అంతిమయాత్రలో “మార్టియర్ ముజాహిద్”గా అలీ లారిజానీని  కొనియాడారు. దేశ రాజధాని టెహ్రాన్ లో జరిగిన ఈ అంతిమ యాత్ర భారీ జనసంద్రంగా మారింది.

వీధులన్నీ ప్రజలతో నిండిపోయి, దేశభక్తి నినాదాలతో మార్మోగాయి. పలువురు ప్రజలు చేతుల్లో జాతీయ జెండాలు, లారిజాని చిత్రాలు పట్టుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఇరాన్ అత్యున్నత నాయకత్వం, ప్రభుత్వ ప్రముఖులు, మత పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన మరణాన్ని దేశానికి తీరని లోటుగా అభివర్ణించారు.

ఆయన వయస్సు 67 సంవత్సరాలు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అయిన ఆయన తన కుమారుడితో కలిసి ఈ దాడిలో మరణించాడు. మరోవైపు, ఇజ్రాయిల్ మంగళవారం ఉదయం జరిగిన దాడిలో లారిజానీని హతమార్చినట్లు ప్రకటిస్తూ, ఆయనను ఇరాన్‌కు డి ఫాక్టో నాయకుడిగా అభివర్ణించింది.

అలీ లారిజాని ఇస్లామిక్ రిపబ్లిక్‌లో దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన నాయకుడు. అమెరికా, ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ చేపట్టిన యుద్ధ వ్యూహాల్లో ఆయన ప్రధానంగా వ్యవహరించారు. ఆయన రాజకీయాల్లో అతివాదులు, మితవాదుల మధ్య సమతుల్యత సాధించే సామర్థ్యంతో ప్రసిద్ధి చెందారు.

ప్రస్తుతం ఇరాన్ నాయకత్వ వ్యవస్థలో కీలక భాగంగా ఉన్న లారిజాని మరణం దేశానికి పెద్ద నష్టం గా భావిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఉన్నత స్థాయి నాయకత్వం తగ్గిపోతుండటంతో, ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనపై దీని ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

అలీ లారిజాని మరణం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చోటుచేసుకోవడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనను దేశభక్తుడు, పోరాట యోధుడిగా ప్రజలు స్మరించుకుంటున్నారు.

అంతిమ యాత్ర సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజల భారీ హాజరు ఆయనకు ఉన్న ప్రజాదరణను స్పష్టంగా చూపించింది.

Related posts

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

Satyam News

మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించిన అమిత్ షా

Satyam News

వెనిజులా అధ్యక్షుడి గురించిన ఆసక్తికర సమాచారం ఇది…

Satyam News

రూ. 2కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Satyam News

వనపర్తిలో జిల్లా ఎస్పీ సునితకు స్వాగతం

Satyam News

పాడి రైతులకు క్రెడిట్‌ కార్డులు‌….. ఏపీ ప్రభుత్వం కొత్త స్కీమ్‌

Satyam News

Leave a Comment