25.2 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్ అభినందన

#Revanthreddy

ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుని హ్యాట్రిక్ సాధించిన తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విజయం రాష్ట్ర పోలీసుల నిరంతర కృషి, క్రమశిక్షణకు నిదర్శనమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ సీఐడీ పర్యవేక్షణలో నిరంతర శిక్షణ ఈ విజయానికి కారణమైందని, జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటిన సందర్భంగా ముఖ్యమంత్రి, డీజీపీ బి. శివధర్ రెడ్డి, సీఐడీ అదనపు డీజీ చారు సిన్హా ని అభినందించారు.

తెలంగాణ పోలీసుల విజయ పరంపర గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. 2024 లక్నోలో (ఉత్తరప్రదేశ్‌), 2025 రాంచీలో (ఝార్ఖండ్‌) జరిగిన పోటీలతో పాటు తాజాగా 2026లో నాగ్ పూర్ (మహారాష్ట్ర) లో జరిగిన 69వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లో విజయం సాధించి తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.

ఈసారి నాగ్‌పూర్‌లో జరిగిన డ్యూటీ మీట్ లో తెలంగాణ ప్రతినిధి బృందం అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీతో పాటు యాంటీ-సాబోటేజ్ చెక్, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్‌నెస్ విభాగాల్లో విజేతగా నిలిచింది. శాస్త్రీయ దర్యాప్తు సహాయాలు, పోలీస్ ఫోటోగ్రఫీ విభాగాల్లో రన్నరప్ సాధించింది.

Related posts

సంచలనం రేపుతున్న ప్రకాశ్ రాజ్ ట్వీట్

Satyam News

Box Office: కలెక్షన్లు తగ్గని దురంధర్ 2

Satyam News

చైనాతో సరిహద్దు సమస్యలపై చర్చలు షురూ

Satyam News

ఏపీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ C4IR కేంద్రం

Satyam News

హృద్రోగానికి తొలిసారిగా అల్ట్రా-ఫాస్ట్ Q-డాట్ అబ్లేషన్

Satyam News

చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాపై ఏం జరుగుతుంది?

Satyam News

Leave a Comment