25.2 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

పెట్రోల్ డీజిల్ సరఫరా బాగుంది.. భయపడద్దు

#fuelShortage

రాష్ట్రoలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 27 వ తేదీన డిమాండ్ ను మించి పెట్రోల్ , డీజిల్ లను 29,939 కిలో లీటర్లు సరఫరా చేసినట్లు వివరించారు. సగటున రోజుకు 5,883 కిలో లీటర్లు పెట్రోల్, 7,348 కిలో లీటర్లు డీజిల్ కు డిమాండ్ ఉండేదని ఆయన తెలిపారు.

కానీ 27 వ తేదీన 11,490 కిలో లీటర్లు పెట్రోల్, 18,449 కిలో లీటర్లు డీజిల్ ను వాహనదారులకు సరఫరా చేసినట్లు తెలిపారు. సరఫరాను క్షేత్ర స్థాయి అధికారులు, పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అపోహలతో పెట్రోల్, డీజిల్ ను నిల్వచేసుకోవద్దని వినియోగదారులకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సూచించారు.

Related posts

ఒంటిమిట్ట శ్రీ కోదండరామునికి పుష్పయాగం

Satyam News

యూపీలో పట్టుబడ్డ స్టాండప్ కమెడియన్ అనుదీప్

Satyam News

పాలంపేట ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు

Satyam News

పేపర్ లీక్ ఘటనలపై ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

Satyam News

సత్తుపల్లి ఓసి లో భట్టి విక్రమార్క క్షేత్రస్థాయి పరిశీలన

Satyam News

బెంగళూర్‌ టు అనంతపురం… ఏపీకి భారీ కంపెనీల క్యూ

Satyam News

Leave a Comment