25.7 C
Hyderabad
July 9, 2024 03: 53 AM
Slider ప్రత్యేకం

టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్?

#maheshkumargoud

రేవంత్ రెడ్డి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడుగా ఎవరిని నియమించబోతున్నారో ఒక స్పష్టత వచ్చింది. ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగియనుంది. ఆయన గత ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపి సీఎం అయ్యారు. దీంతోనే టీపీసీసీ చీఫ్ గా వేరొకరిని నియమిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ ను టీ పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం భావిస్తోందని సమాచారం. మంగళవారం మహేశ్ గౌడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దీంతో ఆయనకే పీసీసీ చీఫ్ పదవి దక్కనుందని స్పష్టం అవుతోంది.

అసలు అందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రి వర్గ విస్తరణకూ కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీపీసీసీని ఎస్సీకి ఇవ్వాలనుకుంటే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీకి ఇవ్వాలనకుంటే బలరామ్ నాయక్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కానీ, రేసులో మాత్రం మహేశ్ కుమార్ గౌడ్ ముందున్నారు. ఇక బీసీకి టీపీసీసీ ఇస్తే ఎస్టీ లంబాడాకు చీఫ్ విప్ ఇవ్వడం ఖాయం. కాగా, బొమ్మ మహేశ్ గౌడ్ నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు.

1990ల్లోనే ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 58 ఏళ్ల మహేశ్ గౌడ్ పీసీసీ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. నిజాబాబాద్ అర్బన్ నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీపీసీసీ చీఫ్ అంటే ముఖ్యమంత్రితో సమానం కావడం గమనార్హం.

Related posts

ఎపిని పర్యాటక రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేలా చర్యలు

Satyam NEWS

వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి

Satyam NEWS

గంభీర్ కు భారీ మొత్తం ఆఫర్ చేసిన షారూఖ్?

Satyam NEWS

Leave a Comment