నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథిగా ఈరోజు హన్మకొండ , బాలసముద్రం లోని పల్స్ పోలియో కేంద్రాన్ని చిన్నారు లకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ నిండు ప్రాణానికి రెండు చుక్కలు అంగవైకల్యం రాకుండా రక్షణ అన్నారు. 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు తప్పక పోలియో చుక్కలు వేయించాలన్నారు. భారతదేశం పోలియో రహిత దేశం గా ఉంది. కానీ కొన్ని దేశాలలో పోలియో ఇప్పటికీ ఉంది. మనం అశ్రద్ధగా ఉంటే తిరిగి రావచ్చు మీ పిల్లలకు రక్షణ కల్పించడంలో ఎలాంటి అలసత్వం చేయవద్దు. ప్రతిసారీ ప్రభుత్వం అందిస్తున్న పోలియో చుక్కలు పిల్లలకు వేయించండి. పోలియో పై విజయం సాధించడం లో దేశానికి తోడ్పడండి అని ప్రజలకు పిలుపునిచ్చారు.
previous post