34.2 C
Hyderabad
May 13, 2024 17: 26 PM
Slider నిజామాబాద్

బీజేపీ విధానాలపై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలి

ఎస్సి, ఎస్టీ, బిసి రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీ విధానాలపై బీఆర్ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజిరెడ్డి గార్డెన్, రాజంపేట మండల కేంద్రాల్లో ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తో కలిసి జహీరాబాద్ పార్లమెంట్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా పాలనతో మార్పు మొదలైందన్నారు.

రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రైతుకు పెట్టుబడి సాయం, రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు,పంటల బీమా పథకం ప్రారంభం, ధరణి పోర్టల్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టి లక్షకు పైగా ధరణి సమస్యల పరిష్కారం కోసం చర్యలు మొదలుపెట్టామని, కౌలు రైతుల రక్షణకు చట్టం తేవడానికి చర్యలు తీసుకుంటున్నామని, 97 కోట్ల రూపాయలతో రైతు నేస్తం కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ విధానంపై బీఆర్ఎస్ వైఖరి ఏమిటో తెలియజేయాలని డిమాండ్ చేశారు.

ఆ విధానాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తే మోడీకి వ్యతిరేకంగా ఆయన కార్యచరణ ఏంటో చెప్పాలన్నారు. మోడీ పాలనలో దేశం వికసిత భారత్ కాలేదన్నారు. ఆర్థిక భారత్ కాదని, ఆకలి భారత్ అయిందని, కొలువుల భారత్ కాదు.. నిరుద్యోగ విలపిత భారత్ గామారిందని విమర్శించారు. పదేళ్ల మోడీ పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను ఆశీర్వదిస్తే కామారెడ్డికి త్రాగు, సాగు నీరు తెప్పిస్థానని తెలిపారు. గత బీఆర్ ల్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల పథకం నిలిపేసిందని, లేకుంటే కామారెడ్డిలో మూడు లక్షల ఎకరాలకు సాగునీళ్ళు వచ్చేవన్నారు. గత కాంగ్రెస్ హయాంలో రేషన్ కార్డులు, సరుకులు ఇచ్చినట్లు ఇప్పుడు ఇస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు కార్పొరేషన్ల ద్వారా ఉపాధి కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సుపరిపాలన కోసం గెలిపించండి:ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్

త్యాగాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సొంతమని, ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా, సుపరిపాలన కావాలన్నా చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని జహీరాబాద్ ఎంపీ.అభ్యర్థి సురేష్ షెట్కార్ అన్నారు. బీబీ పాటిల్ పదేళ్ల పాలనలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని విమర్శించారు. దేశ భద్రత కోసం ఇందిరా గాంధీ చైనా,పాకిస్థాన్ తో యుద్ధం చేసిందని గుర్తుచేశారు.

షబ్బీర్ అలీ సమక్షంలో చేరికలు

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగాయి. బీజేపీ రాష్ట్ర నాయకుడు డా. ఇట్టం సిద్దిరాములు కాంగ్రెస్ లో చేరారు. అలాగే అఖిల ఆస్పత్రి వైద్యులు డా. పుట్ట మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీలో చేరగా షబ్బీర్ అలీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజాంపేట మండల కేంద్ర మాజీ సర్పంచ్ సౌమ్య నాగరాజు, ఆరేపల్లి మాజీ సర్పంచ్ కొమ్ము యాదగిరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

క్లారిటీ: పౌరసత్వ చట్టం వల్ల ఎవరికీ నష్టం లేదు

Satyam NEWS

మళ్లీ ముంచుకొస్తున్న మహమ్మారీ: భారీగా కరోనా కేసులు

Bhavani

యూకే యూరప్ లలో శ్రీ మలయప్పస్వామి వారి కళ్యాణోత్సవాలు

Bhavani

Leave a Comment