35.2 C
Hyderabad
April 27, 2024 12: 27 PM
Slider ఫోటో గాలరీ

నూతన గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలి

#Gram Panchayat

నూతన గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలి. హరితహారంలో లక్ష్యాలకనుగునంగా గ్రామాల్లో మొక్కలు విరివిగా నాటాలి. దశాబ్ది సంపద వనాలు, హార్టికల్చర్ ప్లాంటేషన్ల పనులలో వేగం పెంచాలి. నిర్ణీత లక్ష్యాలను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి.

ఇందుకు అధికారులు క్షేత్ర పర్యటనలు చేసి, కింది స్థాయి అధికారులు, ఉద్యోగులను వేగిర పరచాలి అని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ లోని సచివాలయం నుంచి శనివారం జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డిపిఓ లు, డి అర్ డి ఓ లతో పంచాయితీరాజ్ కమిషనర్ హనుమంతరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… సీఎం కెసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అన్ని గ్రామాలను కడిగిన ముత్యంలా చేశారన్నారు. వారి ఆలోచనలకి అనుగుణంగా రాష్ట్రంలో 12 వేల 769 గ్రామ పంచాయితీలలో 6,544 గ్రామ పంచాయితీలకి భవనాలు ఉన్నాయన్నారు.

మిగితా 6 వేల 225 గ్రామ పంచాయితీ లలో నిధులు మంజూరు చేసి నూతనంగా నిర్మిస్తున్న 3,622 గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. హరితహారం లో భాగంగా పంచాయితీరాజ్ శాఖ కు 6.7 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం ఇవ్వగా, ఇప్పటి వరకు 2.25 కోట్ల మొక్కలు నాటినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మిగితా మొక్కలను కూడా త్వరగా నాటాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు.

ఆలాగే కొత్తగా వ్యవసాయ భూముల్లో దశాబ్ది సంపద వనాలు ఏర్పాటు చేయాలని, హార్టికల్చర్ ప్లాంటేషన్ ను 50 వేల చోట్ల చేయాలని మనం లక్ష్యం నిర్దేశించుకున్నాం అని వాటిని కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్లు, drdo లు, dpo లు, పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైకోర్టును కించపరుస్తూ కామెంట్లు చేసిన వైసీపీ నేతలకు నోటీసులు

Satyam NEWS

మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు

Sub Editor 2

విజయసాయిరెడ్డీ అఖిల పక్ష సమావేశంలో ఇవేం మాటలు?

Satyam NEWS

Leave a Comment