29.2 C
Hyderabad
May 18, 2024 13: 43 PM
Slider నిజామాబాద్

కామారెడ్డి జిల్లా రద్దు చేస్తే కాంగ్రెస్ భూస్థాపితమే

#gampagovardhan

తెలంగాణలో జిల్లాల రద్దుకు ప్రత్యేక కమిషన్ వేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని, కామారెడ్డి జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమేనని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. దమ్ముంటే జిల్లాను రద్దు చేసి చూడాలని, కామారెడ్డి జిల్లా జోలికి వస్తే ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ నాయకులను అడుగు పెట్టనివ్వరన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీలు అంటూ 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసారని, హామీలను నమ్మి ప్రజలు ఓటేసి గెలిపించారన్నారు. ఈ 5 నెలల్లో ఉచిత బస్సు సౌకర్యం తప్ప హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ఆ పథకానికి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, రాబోయే రోజుల్లో ఆర్టీసీ డిపోలకు తాళాలు వేసే పరిస్థితి నెలకొందన్నారు.

ఇప్పటికే 20 శాతం బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయని పేర్కొన్నారు. సీఎం గ్యారెంటీలను ప్రజలు నమ్మడం లేదని, 2 లక్షల రుణమాఫీపై రైతులు నమ్మే పరిస్తితి లేకపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా ప్రముఖ దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు. హామిలను నెరవేర్చడం లేదని రిపోర్టులు రావడంతో ప్రమాణాలు చేయడం సిగ్గుచేటన్నారు. రైతులకు 500 బోనస్ అంటూ రెండు పంటలు దాటవేసి రైతులను మోసం చేశారన్నారు.

నాడు తమ ప్రభుత్వ హయాంలో నాటి మంత్రులు ఢిల్లీ వెళ్లి బీజేపీ మంత్రులను కలిసి ధాన్యం కొనాలని అడిగితే తెలంగాణలో నూకలు వస్తాయని, వాటిని కొనలేమని, ఆ నూకలు తెలంగాణ ప్రజలకు తినిపించాలని మాట్లాడారని గుర్తు చేశారు. పదేళ్ళలో బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు నూకలు బుక్కిస్తారన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం జిల్లాల పెంపు చేస్తే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ వేసి జిల్లాల రద్దు కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో కామారెడ్డి జిల్లా ఏర్పాటు కాదని, కరీంనగర్, సిద్ధిపేట, సిరిసిల్లలో కలుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేసారని గుర్తు చేశారు. జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో ప్రజల చిరకాల కోరిక కామారెడ్డి జిల్లాను కోట్లాడి సాధించుకున్నామని, అలాంటి జిల్లాను రద్దు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఇప్పుడు వాటిని పశువుల కొట్టాలుగా మారుస్తారా అని ప్రశ్నించారు.

దమ్ముంటే కామారెడ్డి జిల్లాను రద్దు చేసి చూడాలని, నిన్ను ఇక్కడి ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. జిల్లాను రద్దు చేస్తామని చెప్పే కాంగ్రెస్ నాయకులకు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఇక్కడి నాయకులు వెంటనే జిల్లా రద్దు చేయడం లేదని సీఎంతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారేమో: మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

జిల్లాలు, మండలాల రద్దు చేస్తామని చెప్తున్న సీఎం తెలంగాణను కూడా రద్దు చేస్తారేమోనని, చంద్రబాబు సీఎం అయితే తెలంగాణను ఆంధ్రలో కలుపుతారేమోనని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అనుమానం వ్యక్తం చేశారు. పరిస్థితులను బట్టి చూస్తే అలాగే చేస్తారేమోనని అన్నారు. గెలిచిన 5 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం గురించి మీడియాలో తప్పుడు ప్రచారం చేసారన్నారు.

తమ ఎమ్మెల్యేలతో మేడిగడ్డ సందర్శిస్తే 3 పిల్లర్లు కుంగిన మాట వాస్తవమని తేలిందని, దానిని వంక పెట్టుకుని మేడిగడ్డను ఎండబెట్టారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు కాంగ్రెస్ సృషించిన కృత్రిమ కరువన్నారు. సమస్యల నుంచి ప్రజలను మళ్లించడానికి ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ప్రజల దృష్టిని మళ్లించడం కోసం జిల్లాల రద్దుకోసం కమిషన్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. బీజేపీ, సీఎం రేవంత్ రెడ్డి ఒక్కటై జిల్లాల రద్దుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమాల పురిటీగడ్డ కామారెడ్డి అని జిల్లాను రద్దు చేసి కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు కామారెడ్డిలో అడుగు పెడతారా అని ప్రశ్నించారు. జిల్లాల రద్దు, మండలాలను రద్దు చేస్తామని ప్రకటించడం చూస్తుంటే రేపు తెలంగాణను కూడా రద్దు చేస్తారేమోనన్నారు. ఏపీలో చంద్రబాబు సీఎం అయితే తెలంగాణను ఆంధ్రలో కలుపుతారా అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాను రద్దు చేసి 170 కిలోమీటర్లు దూరం ఉన్న జహీరాబాద్ ను జిల్లాగా చేస్తారట అని తెలిపారు. ఈ నెల 13 లోపు కామారెడ్డి జిల్లా రద్దు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలని లేకపోతే ఉద్యమిస్తామన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో పార్టీకి మంచి పేరు రావడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారాన్ని నిషేదించేలా కుట్ర చేసారన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ఎనాలసిస్: చర్చల మాటున.. చిచ్చుల బాటన…

Satyam NEWS

సిఎంపై అనుచిత పోస్టింగులు చేసిన అధికారి అరెస్టు

Satyam NEWS

సుగంధ ద్రవ్యాలతో వేడుక‌గా శ్రీ‌నివాసునికి స్న‌ప‌నం

Satyam NEWS

Leave a Comment