33.7 C
Hyderabad
April 29, 2024 02: 49 AM
Slider కరీంనగర్

గోరక్ పూర్ టు యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ వయా జమ్మికుంట

#bandisanjai

గోరక్ పూర్ నుండి యశ్వంత్ పూర్ వెళ్లే (12591/ 12592) ఎక్స్ ప్రెస్ రైలు ఇకపై జమ్మికుంటలో ఆగనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి వ్యాపార కేంద్రమైన జమ్మికుంటకు నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని అయితే పలు రైళ్లు ఇటువైపుగా వెళుతున్నప్పటికీ హాల్ట్ లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. అందులో భాగంగా నవజీవన్ ఎక్స్ ప్రెస్, రాయపూర్ ఎక్స్ ప్రెస్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్, దక్షిణ ఎక్స్ ప్రెస్, దానాపూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లను జమ్మికుంటలో ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి ఆయా రైళ్లను జమ్మికుంటలో నిలిపేసే(స్టాపేజ్) అంశంపై చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా గోరక్ పూర్- యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ ను జమ్మికుంటలో (స్టాపేజ్) నిలపాలని రైల్వే శాఖ జాయింట్ డైరెక్టర్ వివేక్ కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు సికింద్రాబాద్ నుండి గుంటూరు వెళ్లే రైలును నెక్కొండ లో ఆగే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తక్షణమే ఆయా ప్రాంతాల్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బండి సంజయ్ విజ్ఝప్తి మేరకు మిగిలిన రైళ్ళను జమ్మికుంటలో నిలిపేవేసే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

Related posts

భట్టి పాదయాత్ర కు ఉత్తమ్ సంఘీభావం

Bhavani

గుజరాత్:100 దాటిన మరణాలు

Bhavani

అసెంబ్లీ సాక్షిగా నాకు జరిగిన అవమానం ఏ ఆడకూతురికి జరగకూడదు

Satyam NEWS

Leave a Comment