22.7 C
Hyderabad
July 7, 2024 08: 20 AM
Slider విజయనగరం

విజయనగరం వన్ టౌన్ పోలీసుల అదుపులో ఫేక్ రిపోర్టర్ లు

#fakereporters

జర్నలిజం తిండిపెట్టదు… జర్నలిజం కూడు ఇవ్వదు… కానీ జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించిన వాళ్లు ఢిల్లీ నుంచీ గల్లీ వరకు కోకొల్లలు. సరిగ్గా అలాంటి గ్యాంగ్ ని పట్టుకున్నారు…. విజయనగరం వన్ టౌన్ పోలీసులు. నగరంలో హోటల్ మయూర యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో వన్ టౌన్ సీఐ డా వెంకటరావు… క్రైమ్ ఎస్ఐ తారకేశ్వరరావులు తమ బృందంతో… రంగంలోకి దిగి… ఫిర్యాదు ఆధారంగా నలుగురు ఫేక్ రిపోర్టర్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ మేరకు  సీఐ డా. వెంకటరావు “సత్యం న్యూస్. నెట్” ప్రతినిధితో మాట్లాడుతూ…. ఫేక్ ఐడీ కార్డ్ లు సృష్టించి… అప్పటికప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఛానల్స్ తో ఫుడ్ ఇన్ స్పెక్టర్లంటూ డబ్బులు వసూళ్లకు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందన్నారు. ఈ విషయమై… మరింతగా విచారణ చేస్తున్నామని… ఫుడ్ ఇన్సెక్టర్ ఎవ్వరూ అలా హోటల్స్ కు వెళ్లి… అడగరన్నది కూడా తమ పరిశోధనలో తేలిందన్నారు. దరిమిలా…. సదరు ఫేక్ రిపోర్టర్ లను స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తున్నామని సీఐ డా. వెంకటరావు తెలిపారు.

Related posts

Good Word : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

Satyam NEWS

శరణాగతి

Satyam NEWS

గణనాయకుని శుభాశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment