36.2 C
Hyderabad
May 7, 2024 13: 44 PM
Slider కవి ప్రపంచం

శరణాగతి

#VVS Krishnakumari

అమ్మా

అకృత్యాలకు,అరాచకాలకు

నిలయంగా మారుతున్న

ఈ జగత్తును చూసి ఆర్తితో

బాధ తప్త హృదయంతో

నీ సన్నిధిని చేరిన నాకు

దయ వాత్స్యాలం ప్రేమ భరితమైన

నీ చల్లని చూపులు స్వాంతననిచ్చాయి

సువాసినీల మాంగల్య బలాన్ని పెంచే

నీ రత్నమయ తాటంకాలు

నాకు మనోధైర్యాన్నిచ్చాయి

నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే

ఈ జగత్తుకు ప్రాణవాయువు

అందించే జీవనాడులు

చేతిలోని త్రిశూలం దుష్ట సంహారం చేసి

“మృగాలను” సంహరించమని

ఆదేశాన్ని ఇస్తున్నది

సన్మార్గంలో నడిచే వారికి

నా అండ ఉంటుంది అని

సంకేతాన్ని ఇచ్చే నీ అభయ హస్తం

నాకు సద్బుద్ధిని ప్రసాదించింది

తల్లీ…..

గానంతో నిను అలరిద్దామంటే

గాయనిని కాను

కవిత్వంతో కీర్తిద్దామంటే

అక్షరం ముక్క రాని అవిద్యా పరురాలిని

మంత్ర తంత్రాలతో ఆరాదిద్దామంటే

మాత్రమంటే ఏమిటో

తెలియని మూడురాలిని

తల్లీ….దుర్గాదేవి చివరగా

శిరసు వంచి నీ ముందు

మోకరిల్లిన నాకు

నీ పాదాలే నాకు శరణాగతి.

పీ. వి.యస్. కృష్ణ కుమారి, తుర్కయాంజాల, 9494510994

Related posts

ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

భద్రాచలం మాకు అప్పగించి మాట్లాడు కేసీఆర్

Bhavani

‘‘మాట తప్పి…మడం తిప్పి మా మనసుల్ని గాయపరచద్దు జగన్’’

Satyam NEWS

Leave a Comment