30.2 C
Hyderabad
July 7, 2024 18: 00 PM
Slider తూర్పుగోదావరి

రేషన్ బియ్యం స్కామ్ లో అడ్డంగా బుక్కైన జగన్ అనుచరుడు

#DwarampudiChandrasekharaReddy

రేషన్ బియ్యం స్కామ్‌ను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ స్కామ్‌లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. రెండు రోజులుగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకినాడలో మకాం వేశారు. కాకినాడ సిటీలో, పోర్టులో స్వయంగా మంత్రి నాదెండ్ల తనిఖీలు చేశారు. కాకినాడ పోర్టులో అశోక్ ఇంటర్నేషనల్‌, హెచ్‌ వన్‌ గోడౌన్లలో భారీగా రేషన్ బియ్యం గుర్తించారు.

ఆ బియ్యాన్ని ఆఫ్రికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అందుకుని అధికారులు.. రెండు గోడౌన్లను సీజ్‌ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా.. ద్వారంపూడి ఫ్యామిలీ కనుసన్నల్లో జరిగిందటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ పోర్టును ద్వారంపూడి.. తన అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నాడని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

ద్వారంపూడి అరాచకాలు చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు.తనిఖీలు పూర్తి అయ్యేంత వరకు పోర్టు నుంచి బియ్యం రవాణా నిలిపివేశారు. రాష్ట్రంలో పేదల పొట్ట కొట్టి అదే రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారంటూ మండిపడ్డారు. పౌరసరఫరాల శాఖ సంబంధించి శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. పూర్తిస్థాయి పరిశీలన జరిపాక.. సీఐడీతో విచారణ కూడా జరిపిస్తామని మంత్రి నాదెండ్ల అన్నారు.

Related posts

జనవరి 1న భద్రాద్రిలో తెప్పోత్సవం, 2న ఉత్తర ద్వార దర్శనం

Bhavani

కాలుష్య కారక దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్ జి టి నోటీసు

Satyam NEWS

కొత్త సంవత్సరంలో మాజీమంత్రి జూపల్లి కొత్త నిర్ణయం?

Satyam NEWS

Leave a Comment