28.7 C
Hyderabad
May 6, 2024 00: 34 AM
Slider ప్రత్యేకం

కొత్త సంవత్సరంలో మాజీమంత్రి జూపల్లి కొత్త నిర్ణయం?

#Jupally

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చవిచూసినా కూడా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన పాత్ర పోషిస్తూనే ఉన్నారు. గ్రామ గ్రామానా వీలున్నప్పుడల్లా పర్యటిస్తూ అనునిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.

మార్నింగ్ వాక్ పేరుతో ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. అదేవిధంగా  తన అనుచర వర్గానికి  అండగా నిలుస్తున్నారు. ఎంతో మందికి సాయం చేస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు 2022 కొత్త సంవత్సరంలో మళ్లీ  మార్నింగ్, ఈవినింగ్ వాక్ లతో  కాలినడకన ప్రజల దగ్గరికి వెళుతున్నారని సమాచారం అందుతుంది. జనవరి ఒకటవ తేదీ నుండి ఆయన నిరంతరం నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలిసింది.

మెట్రో ఫుట్వేర్ షాప్ ను ప్రారంభించిన.. మాజీ మంత్రి

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఏలాంటి ప్రోటో కాల్ లేకపోయిన తన అనుచర వర్గం ఎక్కడ ఆయనకు దూరం కాలేదు. కేవలం ఒప్పందాలతో లబ్ధి పొందడానికి ఇద్దరు ముగ్గురు ఎందుకు వెళ్ళారో అందరికీ తెలిసిందే..అయితే  జూపల్లి మాత్రం ప్రజల నుండి  మరింత అభిమానాని పొందుతున్నారు. అనుచరవర్గం కూడా ఆయన  చేతులమీదగా ప్రారంభించింది ఏదైనా విజయవంతంగా నడుస్తాయి అనే భావనలో వుంటారు.

అంత కన్న ఎక్కువ అభిమానం కూడా వుంది. బుధవారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో మెట్రో ఫుట్ వేర్ షాప్ ను ఏర్పాటు చేశారు. ప్రారంభానికి ముఖ్యఅతిథి గా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ను అనుచరుడు అబ్దుల్   ముఖ్యఅతిథిగా ఆహ్వానించాడు. కొల్లాపూర్ మున్సిపల్  మహిళా ప్రజాప్రతినిధులు (కౌన్సిలర్స్),అనుచర వర్గ సమక్షంలో  షాప్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అనంతరం మెట్రో ఫుట్ వేర్ షాప్ ను పరిశీలించారు. మొదటి గా షూ కొనుగోలు చేసి వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరు  కొనుగోలు చేయాలనీ అనుచరవర్గానికి ఆదేశించారు. అంతక ముందు యజమాని అబ్దుల్ మాజీ మంత్రికి శాలువా కప్పి సన్మానించారు.

అదేవిధంగా మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు మేకల రమ్య నాగరాజు, మేకల శిరీష కిరణ్ యాదవ్, శ్రీ లక్ష్మి వేణు యాదవ్, జ్యోతి శేఖర్, నయిం లకు శాలువా కప్పి సన్మానించారు..షాప్ యజమానికి మాజీమంత్రి మిఠాయి తినిపించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సాయంత్రం 16వ వార్డు కౌన్సిలర్ యువ నాయకులు నరసింహారావు షాపును పరిశీలించారు. షాప్ వ్యాపారంలో ముందుకు వెళ్లాలని కోరారు. యజమానికి శుభాకాంక్షలు చెప్పారు.

అదే రోజు మాజీ మంత్రి జూపల్లి పట్టణంలో పర్యటించి మృతి చెందినవారికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను   పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఆర్థిక సహాయాన్ని అందించారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

బయటపడ్డ రాయల్ వశిష్ఠ బోటు అవశేషాలు

Satyam NEWS

శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు

Satyam NEWS

హుజూర్‌నగర్ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

Leave a Comment