22.7 C
Hyderabad
July 7, 2024 08: 16 AM
Slider విజయనగరం

అల్లూరి చూపిన‌ తెగువ, పట్టుదల మన‌కు ఆదర్శనీయం

#alluri

మ‌న్యం వీరుడు అల్లూరు  చూపిన తెగువ‌,ప‌ట్టుద‌ల‌…మొత్తం డిపార్టెమంట్ కే ఆద‌ర్శ‌నీయమ‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఏఎస్పీ ఆస్మా ఫ‌ర్హీన్ అన్నారు. డీపీఓలో…ఎస్పీ ఆదేశాల‌తో ఏఎస్పీ….అదే విధంగా ఆర్మ‌డ్ రిజ‌ర్వ్ డీఎస్పీ యూనియ‌ర్స్..ఆర్ఎస్ లు గోపాల్ నాయుడు డీసీఆర్బీ సీఐ ముర‌ళీలు అల్లూరి చిత్ర ప‌ఠానికి పూల దండలు వేసి నివాళులు అర్పించారు. సాయుధ పోరాటంతోనే స్వాతంత్ర్య  సిద్ధిస్తుందని విశ్వసించిన మహోన్న‌త  వ్య‌క్తి  సీతారామ‌రాజు అని ఏఎస్పీ అన్నారు.

స్వాతంత్ర్య సాధన కోసం అల్లూరి సీతారామరాజు విప్లవ పందాను ఎన్నుకున్నారన్నారు.ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్ర పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఆయన ఢీ కొన్నారన్నారు.అల్లూరి సీతారామ రాజు నేడు భౌతికంగా మన మధ్యలేనప్పటికీ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన చూపిన తెగువ, పట్టుదల మనందరికి ఆదర్శనీయమని, స్ఫూర్తిదాయకమని జిల్లా  అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ అన్నారు.

ఈ కార్యక్రమంలోఆర్ఎస్  లు ఆర్.రమేష్, టి.భగవాన్, ఆఫీసు పర్యవేక్షకులు ప్రభాకరరావు, వెంకటలక్ష్మి, ఆర్.ఎస్.ఐలు సూర్యనారాయణ, వరప్రసాద్, తిరుపతిరావు, గోపాలరావు, ముబారక్ ఆలీ, మహేష్, రామారావు, మంగలక్ష్మి లు పాల్గొన్నారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజుకి  జిల్లా పోలీసుశాఖ ఘ‌న నివాళులు అర్పించింది.  విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకొని, జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది అల్లూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి, పుష్ఫాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ మాట్లాడుతూ – స్వాతంత్ర్యం కేవలం సాయుధ పోరాటంతోనే సిద్ధిస్తుందని విశ్వసించి, స్వాతంత్ర్య సాధన కోసం అల్లూరి సీతారామరాజు విప్లవ పందాను ఎన్నుకున్నారన్నారు.మన్యంలో బ్రిటీషు వారి దోపిడీని ఎదుర్కొని, గిరిజనులకు అండగా నిలిచి, వారిని ఎంతగానో చైతన్యపర్చారన్నారు.ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్ర పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఆయన ఢీ కొన్నారన్నారు.

భారత దేశానికికి స్వాతంత్ర్యం సాధించేందుకు, బ్రిటీషు వారితో అలుపెరగని పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు చిన్న వయస్సులోనే బ్రిటీషువారి తూటాలకు నేలకొరిగాడన్నారు. అల్లూరి సీతారామ రాజు నేడు భౌతికంగా మన మధ్యలేనప్పటికీ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన చూపిన తెగువ, పట్టుదల మనందరికి ఆదర్శనీయమని, స్ఫూర్తిదాయకమని జిల్లా  అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ అన్నారు.

అనంతరం, అల్లూరి చిత్ర పటానికి అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ పూల మాల వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ యూనివర్స్, డీసీ ఆర్బీ సీఐ జె. మురళి, ఆర్ఐలు ఎన్. గోపాల నాయుడు,  ఆర్ఎస్  లు ఆర్.రమేష్, టి.భగవాన్, ఆఫీసు పర్యవేక్షకులు ప్రభాకరరావు, వెంకటలక్ష్మి, ఆర్.ఎస్.ఐలు సూర్యనారాయణ, వరప్రసాద్, తిరుపతిరావు, గోపాలరావు, ముబారక్ ఆలీ, మహేష్, రామారావు, మంగలక్ష్మి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, విప్లవ వీరుడు అల్లూరి చిత్ర పటానికి పుష్పాలు సమర్పించిన ఘనంగా నివాళుల అర్పించారు.

Related posts

నిత్యావసర వస్తువుల పంపిణీ సద్వినియోగం చేసుకోండి

Satyam NEWS

Analysis: రూపాయీ, ఇక లే, కరోనాను వదిలించుకో

Satyam NEWS

ఆది సాయికుమార్ “సీఎస్ఐ సనాతన్” గ్లింప్స్ విడుదల

Satyam NEWS

Leave a Comment