30.2 C
Hyderabad
July 7, 2024 17: 55 PM
Slider కరీంనగర్

స్మార్ట్ సిటీ మిషన్ దేశవ్యాప్తంగా పొడిగింపు

#Bandi Sanjay Kumar

దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ మిషన్ ను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి, కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులను విడుదల చేయాలని గతంలో నేను మూడు సార్లు లేఖ రాశాను. కరోనా వల్ల రెండేళ్ల కాలం వ్రుధా కావడంతో స్మార్ట్ సిటీ మిషన్ ను పొడిగించాలని కోరాం.

బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా వచ్చిన విజ్ఝప్తులపట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వచ్చే మార్చి నెలాఖరు వరకు స్మార్ట్ సిటీ మిషన్ ను పొడిగించినందుకు సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు. కేంద్ర నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ పట్టణాలకు మహర్ధశ రానుంది. పూర్తిస్థాయిలో అబివ్రుద్ధి చెందే అవకాశాలు మెరుగయ్యాయి. అయితే కేంద్ర నిధులు దారి మళ్లించకుండా చూడటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మ్యాచింగ్ గ్రాంట్  నిధులను సకాలంలో మంజూరు చేసి అభివ్రుద్ధికి సహకరించాలి అని ఆయన కోరారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ నిధులను దారి మళ్లించింది. కేంద్రం విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగించి సత్వర పనులు పూర్తి చేసినట్లయితే కరీంనగర్, వరంగల్ పట్టణాలు ఇప్పటికే అద్దంలా మెరిసేవి. కానీ రాష్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేయకపోవడంతోపాటు కేంద్ర నిధులను కూడా దారి మళ్లించింది. నేను పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ లో నిలదీసిన తరువాత కేంద్ర నిధులను జమ చేశారు. గత పాలకులు కమీషన్లకు కక్కుర్తి పడటంవల్లే స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం జరిగింది.

కాంట్రాక్టర్ నుండి కమీషన్లు దొబ్బడం కొందరు పాలకులకు ఆనవాయితీగా మారింది. కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు మళ్లీ కమీషన్ల కోసం అవతారమెత్తారు.  తక్షణమే స్మార్ట్ సిటీ నిధుల అవతవకలు, కమీషన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు.

Related posts

కోరిన వివరాలు అన్నీ హైకోర్టుకు సమర్పించండి

Satyam NEWS

ట్రైన్ మిషప్ : రైలు ఎడ్లబండిని ఢీ కొనడంతో 5గురు మృతి

Satyam NEWS

శ్రమశక్తే నిజమైన ధీశక్తి

Satyam NEWS

Leave a Comment