38.2 C
Hyderabad
May 5, 2024 22: 19 PM
Slider కవి ప్రపంచం

శ్రమశక్తే నిజమైన ధీశక్తి

#M D Khajamoinudden

ఎడాది కొత్తదే

పాడేది పాత పాటే.

ఎన్ని ఉగా దులు రాలేదు.

ఎన్నిఉగా దులు పోలేదు.

ఎక్కిడి గొంగలి అక్కడే.

చావలేక నవ్వలేక ఏడుస్తున్న,

అతుకుల బతుకులతో జనం;

గూడుకట్టిన మూఢ విశ్వాసాలు,

కాలిపోవాలంటున్నాను.

పాతకి గోరీకట్టి,కొత్తకి భేరి కొట్టాలంటున్నాను.

అవినీతి గుండె లో బాకులు,

అన్యాయపు డొక్కల్లో తుపాకులు.

మను సంస్కృతి కి మరణం సత్యం.

అంతర్జాతీయ ధనస్వామ్యానికి,

ఉగాది తిరుగుబాటు చేస్తుందా?

మానవాతీత శక్తుల నమ్మకం లేదు.

మానవుడే నా మతం -మానవత్వం

సమానత్వమే నాగమ్యం

మానవుల సామూహిక శ్రమశక్తి

నిజమైన ధీశక్తి.

దాన్ని ఉపయోగిస్తే ఎప్పటికీ ఉగాదే.

ఎం డి. ఖాజామైనద్దీన్, మహబూబ్ నగర్, 9396626276

Related posts

కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించిన రోషపతి

Satyam NEWS

జూపార్క్ లో పులులను దత్తత తీసుకున్న SBI

Satyam NEWS

కార్యాలయంలో పరిసరాలు పరిశుభ్రoగా ఉంచాలి

Bhavani

Leave a Comment