26.2 C
Hyderabad
July 7, 2024 10: 43 AM
Slider తెలంగాణ వరంగల్

ఆత్మకూర్ చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

revuri mla

చెరువు కట్ట మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలోని చెరువు కట్ట కోతకు గురై ప్రమాదకరమైన స్థితిలో ఉన్న విషయం తెలుసుకొని మంగళవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆత్మకూర్ చెరువును అధికారులు, రైతులతో కలిసి సందర్శించారు.సుమారు రెండు కిలోమీటర్ల పైగా ఉన్న చెరువు కట్ట వెంబడి స్వయంగా నడిచి కోతకు గురైన కట్టను, దెబ్బ తిన్న తూములను, మత్తడిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు చెరువు మండలంలోని అతిపెద్ద చెరువు అని ఈ చెరువు కింద సుమారు 1000 ఎకరాలు పంటలు రైతులు సాగు చేస్తారని, ఆత్మకూర్ కామారం చౌల్లపల్లి గ్రామాలతో పాటు అనేక గ్రామాల రైతుల పంటలకు ఉపయోగపడుతుందని, మత్స్య కార్మికులకు ఈ చెరువు జీవనాధారంగా ఉందని అన్నారు.గత సంవత్సరం నుండి చెరువు కట్ట కోత గురై ఉన్నదని గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చెరువు కట్ట మరమ్మతు మనులు సకాలంలో చేయకపోవడం వల్లె నేడు చిన్న వర్షానికి గండ్లు పడి తెగిపోయే పరిస్థితి వచ్చిందని ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన పంటలు దెబ్బతినడమే కాకుండా కామారం గ్రామంతో పాటు ఇతర గ్రామాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు.చెరువు కట్ట శాశ్వత పరిష్కారం కోసం అధికారులు నివేదికలు తయారుచేసి తనకు అందించాలని తాను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కార చర్యలు చేపడతానని అన్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అయినందున ఆత్మకూర్ చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులు త్వరగా ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Related posts

ములుగులో STU TS సభ్యత్వ నమోదు కార్యక్రమం

Satyam NEWS

జర్నలిస్టులపై దాడులు పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు

Bhavani

TRSKV ఆధ్వర్యంలో ఘనంగా మేడే పండుగ

Satyam NEWS

Leave a Comment