30.2 C
Hyderabad
July 7, 2024 14: 31 PM
Slider మహబూబ్ నగర్

4361.66 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించిన జిల్లా సమీక్ష కమిటీ

#wanaparthy

వనపర్తి జిల్లా అభివృద్ధికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను  రూ. 4361.66 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక  కమిటీ ద్వారా ఆమోదించినట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన  జరిగిన  బ్యాంకర్ల జిల్లా స్థాయి సంప్రదింపులు, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నా రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆర్. లోక్ నాథ్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో  లీడ్ బ్యాంక్ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన  రుణ ప్రణాళికను కమిటీ ఆమోదించినది. గత సంవత్సరం 2368.04 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని సాధించగా ఈ సంవత్సరం మరో 1993.62 కోట్లు అదనంగా కలిపి 4361.66 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రాధాన్యత రంగాలకు 3961.06 కోట్లు కేటాయించడం జరిగింది.

వనపర్తి జిల్లా వ్యవసాయ రంగం పై అధికంగా ఆధారపడి ఉన్నందున వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 3454.95 కోట్లు అనగా 79.21 శాతం కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇందులో పంట రుణాలకు 2461.02 కోట్లు, వ్యవసాయ టర్మ్ లోన్ కింద 571.80 కోట్లు, మౌళిక సదుపాయాల కల్పనలో 96.01, అనుబంధ కార్యకలాపాలకు రూ. 326.12 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. యం.ఎస్.యం.ఈ సెక్టార్ కింద రూ. 353.84 కోట్లు రుణాలు ఇవ్వనున్నారు.  ఇతర ప్రాముఖ్యత కలిగిన సెక్టార్ కు 152.27 కోట్లు కేటాయించగా ఇందులో విద్యా రుణాలు 22.95 కోట్లు, గృహ నిర్మాణాలకు రూ. 112 కోట్లు కేటాయించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్లు ఈ రుణ ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను చేరుకోవాలని, జిల్లాలో మంచి వర్షాలు కురుస్తున్నాయనీ, రైతులకు ఉదారంగా రుణాలు అందించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్నారు.  గ్రామీణ స్థాయిలో రైతులకు ఆర్థిక లావాదేవీల పై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. రైతులు పంట రుణాలు రెన్యువల్ చేసుకోలేక చాల నష్టపోతున్నారని అన్నారు. రైతు వేదికలను ఉపయోగించుకొని, వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపులు నిర్వహించాలని సూచించారు.

క్రాప్ లోన్ మంజూరు కొరకు గ్రామ గ్రామస్థాయిలో మేళా నిర్వహించాలని సూచించారు.  దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు ఉదారంగా రుణాలు అందించి   వారి ఆర్థిక స్వావలంబనకు నిబద్ధతతో  కృషి చేయాలని సూచించారు.

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నా రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు బ్యాంకర్లు తమవంతు సహకారం అందించి  జిల్లా అభివృద్ధిలో అన్ని బ్యాంకులు సమానంగా  భాగస్వాములు కావాలని  సూచించారు. గత రబీ సీజన్ లో సాగు నీటి లభ్యత   సక్రమంగా లేకపోవడం చేత లక్ష్యం మేరకు పంటలు పండించలేకపోయామని,  వానాకాలంలో రైతులకు బ్యాంకు ద్వారా పూర్తి సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం  రైతు రుణ మాఫీ కి త్వరలోనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయబోతుందని,  రుణమాఫీ కాగానే బ్యాంకులకు రైతు రుణ బకాయలు జమ అవుతాయన్నారు.

జిల్లాలో ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు రైతులను ప్రోత్సహించి అందుకు సరిపడ రుణాలు అందించాలని సూచించారు.

మామిడిమాడ లో బ్యాంకింగ్ సేవలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆర్. లోక్ నాథ్ రెడ్డి ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆర్.లోక్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పాల ఉత్పత్తి పెంచేందుకు రైతులకు రుణాలు అందించాలని కోరారు.  జిల్లాలో పాల ఉత్పత్తికి ఎన్నో అవకాశాలు ఉన్నా జిల్లా ప్రజల అవసరాలకు  ఇతర రాష్ట్రాల నుండి తెప్పించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. పాల డైరీని అభివృద్ధి చేసే విధంగా రైతులకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకునేందుకు ఉదారంగా రుణాలు మంజూరు చేయాలని, ఏమైనా సాంకేతిక ఇబ్బందులు వస్తె జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు రావాలని బ్యాంకర్లను సూచించారు.  పాల ఉత్పత్తి దారులతో సమావేశం నిర్వహించి వారికి ఉన్న ఇబ్బందులను తెలుకొని జిల్లాలో  పాడి పరిశ్రమ అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  అదేవిధంగా ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించి రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలని తెలియజేశారు.

ఈ సమావేశానికి లీడ్ బ్యాంక్ మేనేజర్ అమోల్ పవార్ కన్వీనర్ గా వ్యవహరించగా ఆర్.బి. ఐ నుండి ఎల్.డి. ఓ పల్లవి, నాబార్డ్ ఏ.జి.యం. మనోహర్ రెడ్డి, కే.వి.కే. సైటిస్ట్ దాదాసాహెబ్ ఖోగారే, యునియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ హెడ్ శ్రీనివాస్ మూర్తి, ఎస్.బి. ఐ  ఎ.జి.యం , అన్ని బ్యాంకుల మేనేజర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ప్రజా సమస్యల పరిష్కరమే నా ధ్యేయం

Satyam NEWS

బాహుబలి రాజమౌళికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

‘ ఫ్లై హై టూరిజం’ వెబ్ సైట్ ప్రారంభించిన మంత్రి

Bhavani

Leave a Comment