33.7 C
Hyderabad
April 28, 2024 00: 18 AM
Slider ముఖ్యంశాలు

‘ ఫ్లై హై టూరిజం’ వెబ్ సైట్ ప్రారంభించిన మంత్రి

#Dr. V Srinivas Goud

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక ,వారసత్వ, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో’ ఫ్లై హై టూరిజం’ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామన్నారు.

అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశీ, స్వదేశీ పర్యాటకులు రాష్ట్రానికి తరలి వస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక చారిత్రక ,వారసత్వ, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అనేక పర్యాటక ప్రదేశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు.

తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ ను నిర్వహించి రాష్ట్రానికి పర్యాటకుల ను ఆకర్షిస్తూన్నమన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లై హై టూరిజం కు చెందిన నిర్వాహకులు యశ్ పాల్ వీరగోని, సోనియా తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి జగదీష్ రెడ్డిపై కుట్ర పన్నింది ఎవరో తెలుసా?

Satyam NEWS

కరోనాతో మరణించిన పోలీసు కుటుంబాలకు రూరల్ ఎస్పీ భరోసా

Satyam NEWS

కడుక్కుంటే పోయేవి కాదు మమతా బెనర్జీ పాపాలు

Bhavani

Leave a Comment