22.7 C
Hyderabad
July 7, 2024 07: 17 AM
Slider జాతీయం

వింత ఆచారం:గ్రహణం రోజున పిల్లలను పాతిపెడితే

eclips day 26

దేశ వ్యాప్తంగా సూర్యగ్రహణం పూర్తయింది. అయితే కొందరు మూఢ నమ్మకాల పేరుతో  రెచ్చిపోయారు. వింత ఆచరాలతో పిల్లల ప్రాణాలను పణంగా పెట్టారు. సూర్యగ్రహణ సమయంలో పిల్లలను నేలలో పాతిపెట్టిన ఘటన కర్ణాటకలో కలవరం రేపుతోంది.

కర్ణాటకలోని గుల్బర్గ నగర శివార్లలోని తాజ్‌సుల్తాన్‌పూర్ గ్రామంలో సూర్యగ్రహణం సమయంలో (8.00 A. M. నుండి 11.05 A. M వరకు) ముగ్గురు పిల్లలు సంజన (4), పూజ క్యమలింగ (6) మరియు కావేరి (11) మెడ వరకు  నేలలో పాతిపెట్టారు. గ్రహణం సమయంలో అంగవైకల్యంతో ఉన్న పిల్లలను నేలలో పాతిపెడితే అంగవైకల్యం పోతుందనేది వారి నమ్మకమంట. పిల్లలు ఏడుస్తున్నా బయటకు తీయకుండా గ్రహణం అయిపోయే వరకు నేలలోనే ఉంచారు.

జనవిజ్ఙాన వేదిక సభ్యులు ఇదేమి ఆచారమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేలలో పాతిపెడితే అంగవైకల్యం ఎలా పోతుందని ప్రశ్నించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారం. దీంతో గుల్బర్గ డిప్యూటీ కమిషనర్ బి. శరత్‌ తహశీల్దార్‌ను అక్కడికి పంపించి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చిన్నారులను రక్షించారు. అనంతరం పిల్లల తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.

Related posts

సజావుగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తి

Satyam NEWS

జులై 3 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

Satyam NEWS

రహదారులు అన్నీ పచ్చని చెట్లతో నిండాలి

Satyam NEWS

Leave a Comment