ముఖ్యమంత్రి కేసీఆర్, మజ్లీస్ పార్టీ ముస్లిం యాక్షన్ కమిటీ వాదనకు బహిరంగంగా మద్దతు తెలుపడంతో టీఆరెస్ పార్టీ కూడ మజ్లీస్ పార్టీ లాగ మత చాందసవాద రాజకీయపార్టీగా వ్యవహరిస్తోందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్ రావ్ అన్నారు. మజ్లీస్ , టీఆరెస్ పార్టీలు రెండు అవిభాజ్య కవలలుగా బీజేపీ భావిస్తోందని, వీరి మధ్య విడదీయరాని బంధం ఉందని ఆయన అన్నారు.
ఈ రెండు పార్టీల అధినేతలు కేసీఆర్, అసద్దుద్దీన్ లు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకుంటున్న జాతి సంరక్షణ, అంతర్గత భద్రత కు సంబంధించిన విధానాలను నిర్ణయాలను చట్టాలను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. ద్వేషపూరిత రాజకీయాలతో తెలంగాణ రాష్ట్రంలో మత అశాంతిని సృష్టించడానికి కెసిఆర్, అసదుద్దీన్ చేస్తున్న ప్రయత్నాలను బిజెపి తీవ్రంగా ఖండింస్తోందని కె. కృష్ణసాగర్ రావ్ అన్నారు.