22.7 C
Hyderabad
July 7, 2024 06: 51 AM
Slider మహబూబ్ నగర్

లంచగొండి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటా

#sanchitgangwar

వనపర్తి జిల్లాలో అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకోవడం వంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని  ఇలాంటివి తన దృష్టికి వస్తె కఠినంగా చర్యలు ఉంటాయని వనపర్తి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారులు   వరుసగా ఎసిబి దాడుల్లో పట్టుబడటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాలో ఏ ఒక్క అధికారి లంచం తీసుకోవడం లేదా ప్రజలను ఇబ్బంది పెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. 

దానివల్ల లంచం తీసుకునే ఉద్యోగి జైలు కు వెళ్ళడమే కాకుండా  వారి కుటుంబం వీధిన పడుతుందన్నారు. ధరణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించటంలో తహశీల్దార్లు వేగం పెంచాలని రోజుకు కనీసం 15 దరఖాస్తులు పరిష్కరించి దస్త్రాలు తనకు పంపించాలని ఆదేశించారు. గురువారం ఉదయం  వనపర్తి కలెక్టర్ గా  అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో తహశీల్దార్లు, ఆర్డీఓ తో ధరణి దరఖాస్తుల పరిష్కారం పై వెబ్ ఎక్స్ సమావేశం నిర్వహించారు.

ధరణి దరఖాస్తులు పరిష్కరించటంలో వేగం పెంచాలని పెండింగ్ మ్యూటేశన్, సక్షేశన్, పాస్ బుక్ లో కరెక్షన్, కోర్టు కేసు సమాచారం వంటి దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, ఆర్డీఓ పద్మావతి, తహశీల్దార్లు వెబ్ ఎక్స్ మీటింగ్ లో పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

కేసీఆర్ కు షర్మిల భయం పట్టుకుంది

Satyam NEWS

భారత్ లో పుట్టిన వారంతా హిందువులే

Satyam NEWS

యూపీ ఎన్నికల్లో మరోసారి కమల వికాసం

Sub Editor

Leave a Comment