26.7 C
Hyderabad
May 3, 2024 09: 05 AM
Slider జాతీయం

యూపీ ఎన్నికల్లో మరోసారి కమల వికాసం

త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా ఈజీగా విజయం సాధిస్తుందని తాజాగా ఓ సర్వేలో స్పష్టమైంది. మొత్తం 403 స్థానాలు ఉన్న అతిపెద్ద అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని కూటమికి 230-249 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది.

సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి 137 నుంచి 152 సీట్లు, బీఎస్పీ 9 నుంచి 14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఈసారి కూడా ఫోర్త్ ప్లేస్‌కు పరిమితం అవుతుందని తెలిపింది.

బీజేపీ నేతృత్వంలోకి కూటమికి ఈసారి 38.6 శాతం ఓట్లు రావచ్చని, 2017 కన్నా ఇది మూడు శాతం తక్కువ అని నొక్కి చెప్పింది. ఎస్పీకి 34.4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని.. ఇక 2017లో 22.2 శాతం ఓట్లు పొందిన బీఎస్పీ మాత్రం ఈసారి 14.1 శాతంతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. బీఎస్పీ ఓట్లన్నీ ఎస్పీ లేదా బీజేపీకి షెఫిల్ అవుతాయని వెల్లడించింది.

యూపీ ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన పనులపై సానుకూల ధోరణి ఉండటం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా పేర్కొంది. ఇందులో ఇప్పటికే రామ మందిర నిర్మాణం మొదలు కావడం.. కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ కూడా పూర్తి చేసుకుని అందుబాటులోకి రావడం యోగి సర్కార్‌కు కలిసి వచ్చే అంశం అని సర్వేలో అభిప్రాయ పడింది. కాగా ఈ ఎన్నికల్లో గెలిస్తే యోగి ఆదిత్యనాథ్‌ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన నేతగా రికార్డు సృష్టిస్తారు.

Related posts

కరోనా ప్రబలుతున్న వేళ హోళీ పండుగ నిషేదాజ్ఞలు..!

Satyam NEWS

తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు

Satyam NEWS

పదవ తరగతి విద్యార్థుల అంతర్గత మూల్యాంకనం

Satyam NEWS

Leave a Comment