27.2 C
Hyderabad
July 9, 2024 00: 08 AM
Slider మహబూబ్ నగర్

సంస్కరణలకు ఆద్యుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్‌

#DEO

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సంస్కరణలకు ఆద్యుడని నాగర్ కర్నూల్ డిఈఓ గోవిందరాజులు కొనియాడారు. గురువారం నాగర్ కర్నూలు డీఈవో కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు అంబేద్కర్ జీవిత చరిత్రను విద్యార్థుల ప్రతిరోజు ప్రార్థన సందర్భంలో తెలియజేయాలన్నారు.

తద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ కురుమయ్య, ఎస్ పి సి ప్రసాద్ గౌడ్ స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర శెట్టి ఉపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్, సురేందర్ రెడ్డి, రామచంద్ర రావు, మురళి, గుడిపల్లి నిరంజన్,  జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆక్టోబర్ 24 వరకు 30 పోలీస్ యాక్ట్

Satyam NEWS

మరింత కఠినంగా రెండో దశ లాక్ డౌన్ నిబంధనలు

Satyam NEWS

కమలానికి, కారు పార్టీకీ ఏకకాలంలో షాక్ ఇచ్చిన కాంగ్రెస్

Satyam NEWS

Leave a Comment