25.2 C
Hyderabad
July 8, 2024 09: 18 AM
Slider నల్గొండ

కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై బిఆర్ఎస్ ధర్నా

#brsparty

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎన్నికల హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తుందంటూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ రైతులను అన్ని విధాల మోసగిస్తుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత 500 రూపాయల పంట బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్. ఇప్పుడు కేవలం సన్న రకం ధాన్యం కే బోనస్ ఇస్తామని రైతులను మోసం చేస్తుందన్నారు. రాష్ట్రంలో 10% మాత్రమే సన్న రకం ధాన్యం పండిస్తారని మిగతా 90% ఇతర రకాల ధాన్యం ఉంటుందని తెలిపారు. పంట బోనస్ హామీని ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ సర్కార్ మాట మారుస్తుందని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేంతవరకు వారి పక్షాన్ని నిలబడి కొట్లాడుతామన్నారు.

Related posts

జగనన్న గోరుముద్ద రుచి చూసిన మేడా

Satyam NEWS

అనంతపురం డీ మార్ట్ దగ్గర ప్రమాదంలో నలుగురు మృతి

Satyam NEWS

బిగ్ లిస్ట్:సార్లు మీరు పెద్ద పోజిషన్ కు పోవాలే

Satyam NEWS

Leave a Comment