22.7 C
Hyderabad
July 7, 2024 05: 59 AM
Slider ముఖ్యంశాలు

జగన్ మానసిక స్థితిపై ఆందోళన చెందుతున్న వైసీపీ

#jaganinjail

అధికారం కోల్పోయిన తర్వాత జగన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. తాను డబ్బులు పంచినా కూడా జనం ఓట్లు వేయలేదనే వితండవాదాన్ని బలంగా ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డి ఇప్పుడు ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్టయ్యి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వత్తాసు పలుకుతూ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం రాకతప్పదు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్ రెడ్డి నేడు జైల్ లో కలిశారు.

సుమారు అరగంటకు పైగా ములాఖత్ అయిన జగన్.. బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలను చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మాటలు మాట్లాడుతున్నది జగనేనా..? అంటూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి. పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారని జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీకి ఓటేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలో స్వయంగా ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జిల్లా కోర్టు మొదలుకుని సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. ఇక కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏ రేంజిలో హెచ్చరించినదో అందరికీ తెలుసు. కానీ జగన్ మాత్రం అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పడం గమనార్హం.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘పిన్నెల్లిని అన్యాయంగా జైలులో పెట్టారు. పిన్నెల్లిపై హత్యా నేరం మోపారు. టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేసి అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ఇప్పటివరకు రైతు భరోసా వేయలేదు. తల్లికి వందనం డబ్బులు ఏమయ్యాయి?. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు వేస్తామని.. చెప్పిన డబ్బులకు ఏమయ్యాయి?. ఇలాంటివి ఏమీ చేయకుండా రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేస్తున్నారు. దాడులతో భయపెట్టి రాజకీయాలు చేయడం సరికాదు’ అని ప్రభుత్వంపై జగన్‌ మండిపడ్డారు.

Related posts

మకర విళక్కు కోసం మళ్లీ తెరుచుకోనున్న శబరిమల

Satyam NEWS

ఇక అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు

Satyam NEWS

ఘనంగా జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ శాస్త్రీయ ప్రాజెక్టు పోటీలు

Bhavani

Leave a Comment