31.2 C
Hyderabad
July 4, 2024 15: 37 PM
Slider ప్రపంచం

భారత్ పంచశీల సిద్ధాంతమే శరణ్యం

#jizinping

ఇంతకాలం ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించిన చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆశ్చర్యకరంగా శాంతి మంత్రాన్ని జపిస్తున్నారు. తన 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీజింగ్ లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతియుత సహజీవనం అతి ముఖ్యమైనదని అన్నారు. అందుకోసం గతంలో భారత్ ప్రవేశపెట్టిన పంచశీల సిద్ధాంతాన్ని ఆయన ఉటంకించారు. “శాంతియుత సహజీవనం కోసం ఐదు సూత్రాలు అత్యవసరం. వాటిని అనుసరించడం అనివార్యమైన చారిత్రక అవసరం’’ అని ఆయన అన్నారు.

గతంలో చైనా ఐదు సూత్రాలను ప్రతిపాదించింది. అవి: ‘సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రత పట్ల పరస్పర గౌరవం’, ‘పరస్పర దురాక్రమణ’, ‘ఒకరి అంతర్గత వ్యవహారాల్లో పరస్పరం జోక్యం చేసుకోకపోవడం’ సమానత్వం, పరస్పర ప్రయోజనం’, ‘శాంతియుత సహజీవనం’ అనే ఐదు సూత్రాలను మొదటిసారిగా చైనా వెల్లడించింది. ఈ ఐదు సూత్రాలు అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, అప్పటి చైనా అధ్యక్షుడు ఝౌ ఎన్‌లాయ్‌లు నిర్వచించారని ఆయన అన్నారు.

Related posts

మహా ప్రభంజనంలా తెలుగుదేశం మహానాడు

Satyam NEWS

లండన్ కు జగన్

Bhavani

రిటైర్మెంట్ ఉద్యోగానికే కానీ వ్యక్తిత్వానికి కాదు

Satyam NEWS

Leave a Comment