Slider అనంతపురం

సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు

#palleraghunathareddy

రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇవ్వాలని  డిమాండ్ చేస్తూ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అధ్వర్యంలో  తెలుగుదేశం పార్టీ శ్రేణులు వందలాది మంది రైతులతో కలిసి మంగళ వారం ఓడి చెరువు మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. సిఎం డౌన్ డౌన్, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రైతులు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యంతోనే విద్యుత్తు కోతలు అధికం అయ్యాయని అన్నారు. నిరంతరం పగటి పూట రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో ఎక్కడ విద్యుత్ కోతలు లేవన్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూర దృష్టి తో రాష్ట్రంలో మిగులు విద్యుత్ సరఫరా ఉండడం వల్ల రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, నాణ్యమైన విద్యుత్ సరఫరా రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు.

టీడీపీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ 5 ఏళ్ల పాలనలో కనీసం నయా పైసా విద్యుత్ చార్జీలు కూడా పెంచిన దాఖలాలు లేవన్నారు. కోతలు లేని విద్యుత్ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని అందుకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణం అన్నారు. సైకో జగన్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ కోతలు అధికం అయ్యాయని అన్నారు. 

ఎక్కడ చూసినా విద్యుత్ కోతలతో ఉద్యాన పంటలు, వాణిజ్య పంటలు, వరి, వేరుశనగ, కూరగాయల పంటలు తీవ్రంగా ఎండిపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఏ  రైతు కూడా సంతోషంగా లేడన్నారు. సైకో జగన్ పాలనకు స్వస్తి పలకాలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు నిరంతరం పగటి పూట 9గంటలు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్  చేశారు. వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్ పార్మర్లు తక్షణం మంజూరు చేయాలని కోరుతూ ట్రాన్స్ కో ఏడీఈ ఓబులేసు, ఏఈ రామసురా రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, నియోజకవర్గ పరిశీలకుడు పార్థ సారధి రెడ్డి, టిడిపి మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ జడ్పిటిసి పిట్టా ఓబుల్ రెడ్డి, టీడీపీ నాయకులు మాజీ ఎంపిటిసి రామానాయుడు,  పీట్ల సుధాకర్, అంజనప్ప, నిజాం, ఓబుల్ రెడ్డి, సర్పంచ్ శంకర్ రెడ్డి, ఎంపిటిసి శ్రీనివాసులు తుమ్మల మహబూబ్ బాషా, మాజీ కన్వీనర్ రాజారెడ్డి, కొండే ఈశ్వరయ్య, కంచి సురేష్, అరీప్, రమణ రెడ్డి, నాగరాజు, ఇర్సద్, ఈశ్వరయ్య, శ్రీనివాసులు, వల్లపు సోమశేఖర్,మాజీ ఎంపిపి ఉంట్ల బ్రహ్మానంద రెడ్డి ప్రేమా నంద రెడ్డి, పొగాకు జాకీర్ , గిరి ,షానవాజ్ ,జయచంద్ర రెడ్డి , ఎద్దుల నరసింహ రెడ్డి ,నాగిరెడ్డి,  అంజినరెడ్డి, గంటా శ్రీనివాస్, నారప రెడ్డి, సౌదీ నాగరాజు,  రంగారెడ్డి ,మస్తానమ్మ, అఖిల, భాగ్యమ్మ, సాలెమ్మ, జ్యోతి, పాపమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేకాట ఆడుతూ పట్టుబడ్డ వైసీపీ ఎమ్మెల్సీ కొడుకు

Satyam NEWS

కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

Satyam NEWS

రికార్డు స్థాయిలో బిజినెస్ చేసిన వాల్మీకి

Satyam NEWS

Leave a Comment