24.7 C
Hyderabad
July 6, 2024 00: 06 AM
Slider ప్రపంచం

ఎలాన్‌ మస్క్‌తో సీఎం చంద్రబాబు భేటీ..?

#elonmusk

చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతూనే పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయిన తొలినాళ్లలోనే చంద్రబాబు హైదరాబాద్ కు పెట్టుబడులను తీసుకురావడంలో తనదైన ముద్ర వేశారు. అసలు ఐటీ రంగంపై అవగాహన లేని రోజుల్లోనే చాలా ముందు చూపుతో ఆలోచించి ప్రపంచ దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చారు.

అంతటి ఘనత ఉన్న చంద్రబాబు నవ్యాంధ్రకు మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అదే స్థాయిలో పని చేసి ప్రముఖ కంపెనీలను ఏపీలో నెలకొల్పేలా చేశారు. ఇప్పుడు కూడా అదే దిశగా  అడుగులు వేస్తున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చడానికి చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులకు చంద్రబాబు సూచించారు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఎలక్ట్రానిక్‌ వాహనాల (ఈవీ) తయారీలో అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ టెస్లాతో పాటు మరికొన్ని పెద్ద కంపెనీలకు పరిశ్రమల శాఖ అధికారులు లేఖలు రాస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని లేఖల ద్వారా వివరిస్తున్నారు.

ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కొన్ని సంస్థలు అప్పట్లో జగన్ హాయాంలో వెనుదిరిగిపోయాయి. అలాంటి సంస్థలను కూడా గుర్తించి.. రాష్ట్రానికి రావాలని అభ్యర్థిస్తూ.. లేఖలు రాస్తున్నారు. టీడీపీ ఉండగా.. 2019కి ముందు వివిధ సంస్థలతో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల్లో గత ఐదేళ్లలో ఎన్ని ఏపీకి వచ్చాయనే లెక్కలను కూడా తీశారు. మిగతా కంపెనీల పరిస్థితి ఏంటి? అవి ఇంకెక్కడైనా పెట్టుబడులు పెట్టాయా అనే విషయాలను కూడా కనుక్కుంటున్నారు.

ఆ ఒప్పందాలు అమలు కాకపోవడానికి కారణాలేంలనేది గుర్తిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో రూ.13.12 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా ప్రకటించింది. ఆ సంస్థలతో కూడా అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. అయితే, పరిశ్రమల  శాఖ అధికారులు టెస్లా సంస్థకు కూడా లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ ఆ లేఖకు స్పందించి టెస్లా ప్రతినిధులు స్పందిస్తే.. చంద్రబాబు ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడరు.

ఇప్పటికే టెస్లా కంపెనీని తమ రాష్ట్రానికి రప్పించుకోవడం కోసం గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు పోటీలో ఉన్నాయి. కానీ, అంతటి కాంపిటిషన్‌లోనూ చంద్రబాబు నెగ్గుకు రాగలరని ఇప్పటికే గత పరిణామాలు నిరూపించాయి. ఒక్కసారి టెస్లా కంపెనీ ప్రతినిధులు చంద్రబాబుతో లైన్ లోకి వస్తే.. వారిని ఒప్పించడం బాబుకు పెద్ద పనేం కాదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

Related posts

మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

Satyam NEWS

ప్రైవేట్ వాహనాల కు భలే గిరాకీ

Satyam NEWS

పోలీసులనే బ్లాక్ మెయిల్ చేసిన దంపతులు

Satyam NEWS

Leave a Comment