తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల సాధన కోసం సమ్మె నిర్వహిస్తున్నారు. దాంతో దసరా పండుగ సమయంలో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు .ప్రభుత్వం ప్రయివేట్ వ్యక్తులతో బస్సులు నడుపుతున్నారు. అయితే ఇది ఇలా ఉంటే మరోపక్క ప్రైవేటు వాహనాల కు రెక్కలు వచ్చాయి. ఒకే రోజు ఒక వ్యక్తి పై 40రూపాయలు చార్జీ పెంచారు. ఇది ఎక్కడని అంటున్నారా! కొల్లాపూర్ నియోజకవర్గ ప్రాంత కేంద్ర పట్టణం నుండి తుఫాన్ వాహనాలలో హైదరాబాద్ కు వెళ్లాలంటే అదనపుగా 40 రూపాయలు చెల్లించాల్సిందే. అక్కడి నుండి ఇక్కడికి రావాలన్న చెల్లించాల్సిందే. ఆర్టీసీ బస్సులను ప్రయివేటు వ్యక్తులు నడుపుతున్నారు. పండుగ సమయంలో ప్రజల రాకపోకలు ఎక్కువ ఉంటాయి. తుఫాన్ వాహనాలలో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రయాణించే ప్యాసింజర్లతో రోజువారికంటే 40రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. అవసరం ప్రజలది ఎంతైనా ఇచ్చుకోవల్సిందే.ప్ర జల జేబులకు చిల్లు పెట్టుకోవాల్సిందే. అస్సలే దసరా పండగ ప్రజలకు ఖర్చులు ఉంటాయి. ఇదే సమయంలో ప్రజలకు అదనపు ఖర్చులు ఎదురైతే ఎలా ఉంటుంది? ఆర్టీసీ సమ్మె తో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బస్సు ఛార్జీలకన్న తక్కువనే తీసుకుంటున్నామని డ్రైవర్స్ చెప్పుతున్నారు
previous post
next post