33.2 C
Hyderabad
May 4, 2024 02: 16 AM
Slider హైదరాబాద్

పోలీసులనే బ్లాక్ మెయిల్ చేసిన దంపతులు

police west zone

పోలీసులు ఎవరినైనా బెదిరిస్తారంటే నమ్మవచ్చు. అయితే ఇక్కడ పోలీసుల్నే బెదిరిస్తున్నారు ఆ ఇద్దరు. పోలీసులు తాము చెప్పిన మాట వినడం లేదనే కక్షతో పోలీసులపై సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లతో పోస్టులు పెట్టేశారు అట్లూరి సురేష్, ఆయన భార్య ప్రవిజ.

దాంతో నోట మాట రాని బంజారాహిల్స్ పోలీసులు తమ ఉన్నతాధికారులకు చెప్పుకోవడంతో వారు వచ్చి విచారణ జరిపారు. దాంతో అసలు నిజం బయటకు వచ్చింది. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ కథనం ప్రకారం అట్లూరి సురేష్, వాసుదేవ్ శర్మ అనే ఇద్దరికి సివిల్ తగాదాలు ఉన్నాయి. వాసుదేవ్ శర్మ తన ఇంటీరియర్ పనుల కోసం 4 లక్షల 70 వేలు సురేష్ కు చెల్లించాడు.

అయితే పని చేయకుండా సురేష్ వాయిదాలు వేస్తుండటంతో తన డబ్బులు రిటర్న్ ఇవ్వాలని అడిగాడు. డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా బెదరింపులకి దిగాడు సురేష్. దాంతో వాసుదేవ్ శర్మ బంజారాహిల్స్ పోలీసుల వద్దకు వచ్చాడు. తన గోడు చెప్పుకున్నాడు. పోలీసులు సురేష్ ను పిలిచి విచారించారు. ఎవరి వాదన వారు వినిపించడంతో ఇది సివిల్ ఇష్యు కాబట్టి కోర్ట్ కి వెళ్లాలని పోలీసులు సూచించారు.

దీంతో వాసు దేవ్ శర్మ కోర్ట్ కి వెళ్లి నోటీసు తెచ్చాడు. కోర్ట్ ఆదేశాలతో అట్లూరి సురేష్  ని పిలిపించి పోలీసులు మళ్లీ మాట్లాడారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన సురేష్ దంపతులు ఆ సమయంలో ఎసై కాలర్ పట్టుకొని , పోలీసులు పై దురుసుగా ప్రవర్తించారు. దీంతో 8తేదీన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు FIR నమోదు చేశారని కక్ష సాధింపు చర్యగా ఆ దంపతులు ఇద్దరూ సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేశారు. అవన్నీ అవాస్తవాలుగా తేలడంతో  ఇలాంటివి మరోసారి చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని వారిద్దరిని హెచ్చరించారు.

రాజకీయ నాయకుల, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు చెప్పి సురేష్ కు పోలీసులనే బ్లాక్ మెయిల్ చేయడం అలవాటని డిసిపి తెలిపారు. గతంలో జూబ్లీహిల్స్ పీఎస్ లో కూడా అతనిపై కేసు ఉందని అక్కడ కూడా ఇలానే ప్రవర్తించారని డిసిపి తెలిపారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని మరోసారి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Related posts

మార్చి 26 నుండి విజయవాడ టూ షిర్డీ విమానం

Murali Krishna

మంత్రికి రూ.126 కోట్లు, ఎమ్మెల్యేకు రూ.186 కోట్లు

Satyam NEWS

Politics: పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీపై మోడీ వేటు

Satyam NEWS

Leave a Comment