32.2 C
Hyderabad
July 2, 2024 20: 46 PM
Slider సినిమా

కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం

#ntrawards

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారక రామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2023’పేరిట హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో అవార్డుల ప్రధానోత్సవం అతిరథ మహారథుల సమక్షంలో జరిగింది. కళావేదిక (R.V.రమణ మూర్తి గారు), రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీపం వెలిగించి ఎన్టీఆర్ పాటలతో ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప, మురళి మోహన్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కే. ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మరియు కొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు పైన అవార్డ్స్ పెట్టడం చాలా ఆనందకర విషయం.

ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో ఘనవిజయాన్ని అందుకున్న నాయకుడు ఎన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం, అదేవిధంగా పేదలకు ఉత్తమ చికిత్స అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక మగాడు మన తెలుగోడు ఎన్టీఆర్. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మేమందరం ముందుకు వస్తాము అంటే ఇందిరాగాంధీని ఎదుర్కొని నిలబడటం అంత తేలిక కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఎన్టీఆర్. నాకు ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని అన్నారు.

నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు చిత్రరంగమైనా, రాజకీయరంగమైనా సంచలనానికి మారుపేరు. సినిమా రంగంలో ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. ప్రతి నాయకుడు పాత్రతో కూడా మెప్పించారు. అదేవిధంగా రాజకీయ రంగంలో పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లో ఘనవిజయాన్ని సాధించారు. పేదల కోసం, అదేవిధంగా ఆడవారి హక్కుల కోసం పోరాడి వారి హక్కులను వారికి అందించారు. అలాంటి మహానుభావుడికి కొడుకుగా పుట్టడం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను. నాన్నగారి పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన కళావేదిక వారికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కళావేదిక భువన మరియు రాఘవ మీడియా వారికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు నందమూరి మోహన్ రూప.

అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత, ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం, ఈ ఈవెంట్‌లో నేను కూడా స్పాన్సర్‌గా ఉండడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. గతంలో కళావేదిక వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కళావేదికతో పాటు రాఘవి మీడియా మధు భాగమవడం, అదేవిధంగా ఈవెంట్ ఇంత ఘనంగా జరిపించడం చాలా మంచి విషయం. కళావేదిక, రాఘవి మీడియా సంయుక్తంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఎన్టీఆర్ ఖ్యాతిని పెంచాలని, వాటిలో నేనూ భాగం అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు.

కళావేదిక మరియు రాఘవి మీడియా అధినేతలు మాట్లాడుతూ.. ఈ ఈవెంట్‌కి పిలవగానే విచ్చేసిన మురళీమోహన్‌గారికి, నందమూరి మోహన్ కృష్ణగారికి, మోహన్ రూపగారికి ప్రముఖులకి ధన్యవాదాలు. అదేవిధంగా ఈవెంట్ ఎంత బాగా జరగడానికి మాకు సహకరించిన మా స్పాన్సర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు.

ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ 2023 గెలుచుకున్న విజేతలు వీరే:

ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు: మురళీమోహన్, నందమూరి మోహన్ కృష్ణ

ఉత్తమ కథానాయకుడు: ఆనంద్ దేవరకొండ (బేబి)

ఉత్తమ దర్శకుడు: సాయి రాజేష్ (బేబి)

ఉత్తమ నిర్మాత: సాహు గారపాటి (భగవంత్ కేసరి)

ఉత్తమ విలన్: అజయ్ (యక్షిని వెబ్ సిరీస్)

ఉత్తమ నూతన దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా)

ఉత్తమ నూతన నటుడు: తిరువీర్

బెస్ట్ లిరిక్ రైటర్: కాసర్ల శ్యామ్

బెస్ట్ రైటర్: కళ్యాణ్ చక్రవర్తి

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: రఘుకుంచె

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (ఫిమేల్): శరణ్య ప్రదీప్

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (మేల్): హర్షవర్ధన్

బెస్ట్ సింగర్ (మేల్): రాహుల్ సిప్లిగంజ్

బెస్ట్ సింగర్ (ఫిమేల్): మంగ్లీ

బెస్ట్ సినిమాటోగ్రాఫర్: దాశరధి శివేంద్ర

బెస్ట్ ఆర్ డైరెక్టర్ గా నాగేంద్ర

బెస్ట్ కమెడియన్ గా రచ్చ రవి

బెస్ట్ ఎడిటర్ గా చోటా కే ప్రసాద్

బెస్ట్ కొరియోగ్రాఫర్ గా విజయ్ పొలాకి

బెస్ట్ డెబ్యుూ మ్యూజిక్ డైరెక్టర్: ధ్రువన్

బెస్ట్ డెబ్యుూ సపోర్టింగ్ యాక్టర్: లక్ష్మణ్ మీసాల

బెస్ట్ నెగటివ్ సపోర్టింగ్ రోల్: సాహితీ దాసరి

బెస్ట్ డెబ్యూ రైటర్: అజ్జు మహకాళి

బెస్ట్ రివ్యూ కమిటీ: లక్ష్మణ్ టేకుమూడి

స్పెషల్ జ్యూరీ డైరెక్టర్: త్రినాథ్

స్పెషల్ జ్యూరీ ప్రొడ్యూసర్: గౌరీ కృష్ణ

అవార్డులు గెలుచుకున్న వారికి మురళీమోహన్ మరియు నందమూరి మోహన్ కృష్ణ చేతుల మీదగా అవార్డులను అందజేశారు.

Related posts

యోగాను విశ్వజనీనం చేసిన ప్రధాని నరేంద్రమోడీ

Satyam NEWS

పేదలు ఆర్థికంగా బలపడేలా అభివృద్ది పథకాలు

Satyam NEWS

మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేతో తెలుగుదేశంలో కొత్త ఉత్సాహం

Bhavani

Leave a Comment