28.2 C
Hyderabad
May 8, 2024 23: 15 PM
Slider సంపాదకీయం

మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేతో తెలుగుదేశంలో కొత్త ఉత్సాహం

#chandrababu

వందసార్లు చెప్పినా అబధ్దం నిజం కాదు. ఈ విషయం తెలిసి కూడా పదే పదే అవాస్తవాలు ప్రచారం చేస్తూ… అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు వైసీపీ పెద్దలు. మాట తప్పడం, మడమ తిప్పడంలో తమకు తామే సాటి అని నిరూపించుకున్న జగన్ అండ్ కో.. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్య పెడ్డటానికి చేయని ప్రయత్నాలు లేవని చెప్పొచ్చు. సంక్షేమ పధకాల దగ్గర్నుంచి…

అభివృద్ధి పనుల వరకు వైసీపీ నేతలు ప్రజలను ఏ విధంగా ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నారో… వారి తప్పులను ప్రశ్నిస్తే ఎంత అడ్డగోలుగా బుకాయిస్తున్నారో అందరూ చూస్తేనే ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ తప్పుడు ప్రచారాన్ని మరో మెట్టు పైకి తీసుకుపోతోంది అధికార పార్టీ యంత్రాంగం. తమకు అనుకూలమైన మీడియాతో పాటు సోషల్‌ మీడియాలోని అనేక గ్రూపులతో కలిసి రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాన్ని వైసీపీకి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఫైక్‌ సర్వేలతో తప్పుడు ప్రచారాలు ప్రారంభించారు. రాష్ట్రంలో రోడ్లు గుంతలు పడినా.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి పడకేసినా.. అభివృద్ధి కార్యక్రమాల ఊసే లేకపోయినా, తమ ప్రభుత్వం దేశంలోనే నంబర్‌ అని ప్రచారం చేసే వైసీపీ మీడియా వింగ్.. ఎన్నికల సర్వేల పేరుతో మరో జగన్నాటకానికి తెర తీసింది. ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అనేది పక్కన పెడితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్‌ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమనేది ఈ సర్వేల సారాంశం. ప్రజల్లో జగన్‌ సర్కారుపై తీవ్ర వ్యతిరేక ఉన్నా.. ఆ విషయాన్ని కప్పిపుచ్చి, మసి పూసి మారేడుకాయ చేసే విధంగా ఉంటాయి ఈ సర్వేలు.

ఇలాంటి ఫేక్‌ సర్వేల అసలు స్వరూపాన్ని బయటపెట్టింది ఇండియా టుడే మూడ్ ఆఫ్‌ ద నేషన్‌. ఈ సర్వే ప్రకారం ఏపీలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే మెజారిటీ సాధించగలదని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలో టిడిపి 15 లోక్‌ సభ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని సీ ఓటర్‌ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. ఇదే మెజారిటీని అసెంబ్లీ సీట్లకు వర్తింపజేస్తే… టిడిపి 110 సీట్లలో పైగా సాధించే అవకాశముంది.

ఇక జనసేన, బీజీపీలతో పొత్తు పెట్టుకొని కూటమిగా బరిలోకి దిగితే.. వచ్చే సునామీలో వైసీపీ కొట్టుకొని పోవడం ఖాయమని మెజారిటీ ఓటర్ల అభిప్రాయం. రోజు రోజుకీ జగన్‌ సర్కారుపై పెరుగుతున్న వ్యతిరేకత, టిడిపి పట్ల జనాల్లో వస్తున్న ఆదరణ చూసి.. వైసీపీ నాయకులు ప్రత్యామ్నాయాలు వెతుక్కొనే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

ఏలియన్స్‌ కోసం ఎర్త్ బ్లాక్‌ బాక్స్‌ రెడీ

Sub Editor

నాట్ ఫెయిర్ :పిల్లల్ని అరెస్ట్ చేసే స్థాయికి దిగజారారు! లోకేశ్

Satyam NEWS

గ్రీన్ రెవెల్యూషన్: పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష

Satyam NEWS

Leave a Comment