30.7 C
Hyderabad
July 2, 2024 13: 22 PM
Slider జాతీయం

‘నా పదవీ కాలం ముగిసింది’ : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య

#revanthreddy

టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోందనే ప్రచారం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసిందని అన్నారు. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేస్తానని, అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. అధిష్ఠానం ఎవర్ని నియమించినా వారితో కలిసి పనిచేయడమే తన బాధ్యత అని అన్నారు. తాను టీపీసీసీగా ఉన్న కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచామని ఆయన ప్రస్తావించారు.

అసెంబ్లీ ఎన్నికలకు మించి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందని పేర్కొన్నారు.ఇక కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేయడం వల్లే బీజేపీకి లాభం జరిగిందని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్‌కు డిపాజిట్లు వచ్చిన చోట తాము గెలిచామని, బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిన చోట బీజేపీ గెలిచిందని అన్నారు. ఢిల్లీ మీడియాతో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. తాను కక్షపూరిత రాజకీయాలకు పాల్పడబోనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కు గద్దె దింపాలన్న తన జీవిత లక్ష్యం నెరవేరిందని అన్నారు. ‘‘ ముఖ్యమంత్రిగా నా రెండో కల నెరవేరింది. బీఆర్ఎస్‌ను లోక్‌సభభలో జీరో చేశాను. ఆ పార్టీని సున్నా చేయాలన్న కోరిక కూడా నెరవేరింది. తెలంగాణను పునర్నిర్మించడమే ఇప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యం. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసం అయింది’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Related posts

సుమన్ టీవీ ఆరేళ్ళ అద్భుత ప్రస్థానం

Satyam NEWS

శ్రమిస్తే విజయం వారి సొంతమవుతుంది:మంత్రి నిరంజన్

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంతంలో బోల్తాపడిన పెళ్లి వాహనం

Satyam NEWS

Leave a Comment