31.2 C
Hyderabad
July 4, 2024 16: 07 PM
Slider క్రీడలు

టీ20 ప్రపంచకప్‌ మనదే

17 ఏళ్లుగా ఊరిస్తున్న పొట్టికప్పును భారత్‌ రెండో సారి
సగర్వంగా అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 7 పరుగుల తేడాతో అద్వితీయమైన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా… కోహ్లీ (76. 59 బంతుల్లో 64, 26), అక్షర్‌ పటేల్‌ (47, 31 బంతుల్లో 14, 46) చెలరేగిన వేళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో క్లాసెన్‌ (52, 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. క్వింటన్‌ డికాక్‌ (39,: 31
బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌), స్టబ్స్‌ (31, 21 బంతుల్లో 3 ఫోర్సు, 1 సిక్స్‌) రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్య 3, బుమ్రా 2, అర్డ్‌దీప్‌ సింగ్‌ 2, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశారు.

Related posts

మై లార్డ్: చట్టంతో ఆడుకుంటున్న నిర్భయ దోషులు

Satyam NEWS

అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్న మిల్లర్లు

Satyam NEWS

వరద బాధితులకు ములుగు లయన్స్ క్లబ్ చేయూత

Satyam NEWS

Leave a Comment