23.2 C
Hyderabad
May 7, 2024 19: 06 PM
Slider వరంగల్

వరద బాధితులకు ములుగు లయన్స్ క్లబ్ చేయూత

#mulugu

ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ పూజారి రఘు సారధ్యంలో వరద ముంపు ప్రాంతాలయిన కొండాయి, మాల్యాల మరియు దొడ్ల వాసులకు సుమారు లక్ష రూపాయల విలువ గల వస్తువులు అందజేశారు. వాటిలో నీళ్ల డ్రమ్ములు, వాటర్ క్యాన్లు, బకెట్లు, లుంగీ తువ్వాలు వంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సాయం 75 కుటుంబాలకు అందింది. మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొండాయి ముంపు ప్రాంతాల వారికి ములుగు లయన్స్ క్లబ్ వారు తమ వంతు సహకారంగా వస్తువులు అందించడం అభినందనీయమనీ ఇంకా ఇటువంటి సేవలు ఎన్నో చేయాలని పిలుపునిచ్చారు.

ములుగు లయన్స్  క్లబ్ అధ్యక్షుడు డా౹౹ పూజారి రఘు మాట్లాడుతూ  వరద బాధితులు ఆదుకోవడం తమ వంతు సహాయంగా క్లబ్ సభ్యులు సహకారంతో ఉపయోగపడే వస్తువులు  అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ములుగు లయన్స్  క్లబ్ సెక్రటరీ చుంచు  రమేష్ కోశాధికారి కొండి  సాంబశివ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ సానికొమ్ము  రవీందర్ రెడ్డి, రెడ్ క్రాస్ పాలకమండలి సభ్యులు కొత్తపల్లి ప్రసాద్ రావు రెడ్ క్రాస్ జిల్లా సభ్యులు కొట్టే రాజిరెడ్డి,వివేకానందపురం క్లబ్ డైరెక్టర్ పింగిలి నాగరాజు, ములుగు క్లబ్ సభ్యులు గంగిశెట్టి శ్రీనివాస్  మాట్ల  బద్రీ, దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సుంకరి రవి, కొండాయి ఎంపీటీసీ మూర్తి, కొండాయి సర్పంచ్ వెంకన్న, తుమ్మ మళ్ళా రెడ్డి, కృష్ణ మూర్తి, తుమ్మ సంజీవ రెడ్డి, గడదాసు సునీల్ కుమార్, ఎండీ ఖాజా పాషా, రాంబాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇసుక తుఫాన్ లో జగన్ సర్కార్

Bhavani

విమోచన దినంపై విశ్వహిందూ పరిషత్ కామెంట్స్

Satyam NEWS

సముద్ర తీరంలో ఒ యువతిపై సామూహిక అత్యాచారం

Satyam NEWS

Leave a Comment