33.2 C
Hyderabad
May 4, 2024 01: 43 AM
Slider మహబూబ్ నగర్

అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్న మిల్లర్లు

#ricemills

పేదలకు అందాల్సిన బియ్యాన్ని అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ మిల్లర్లు రీసైకిలింగ్ చేస్తూ వారికి ఇచ్చిన వడ్లకు బదులుగా మరాడించి బియ్యాన్ని పంపించాల్సి ఉండగా దానికి బదులుగా రేషన్ బియ్యాన్ని పంపుతున్నారనే పలు ఆరోపణలు ఉన్నవి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ శివారులో ఎస్సార్ వి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో బిజినపల్లిలోని బాలాజీ ఇండస్ట్రీస్ రైస్ మిల్ యజమాని  అక్రమంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని సీఎంఆర్ కు పెట్టాల్సిన బియ్యానికి బదులుగా గోదాముకు తరలిస్తున్నట్లు సివిల్ సప్లై అధికారులకు అందిన సమాచారంతో శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అట్టి బియ్యాన్ని సోమవారం అధికారులు మూడు కవర్లలో బియ్యాన్ని సేకరించి పరిశోధనలకు పంపించి రిపోర్టు ఉన్నతాధికారుల కు సమర్పించి తదుపరి చట్టపైన చర్యలు తీసుకుంటున్నట్లు ఏఎస్ఓ స్వామి కుమార్ తెలిపారు. అదేవిధంగా రైస్ మిల్లులకు చేరుకొని పరిశీలించినట్లు తర్నికల్ రైస్ మిల్లులో ఎలాంటి రేషన్ బియ్యం దొరకలేదని బిజినపల్లి రైస్ మిల్లులకు చేరుకొని పరిశీలించగా అక్కడ తాళాలు వేసి ఉన్నారని తెలిపారు.

ఈ 146క్వింటాళ్ల 10 కిలోల అనుమానాస్పద బియ్యాన్ని శ్రీ సద్గురు రాఘవేంద్ర పారా బాయిల్డ్ యజమాన్యానికి అప్ప చెప్పినట్లు  ఆయన తెలిపారు.ఈ రసమత్తరమైన ఘటనలో అధికారులు వారి వంతు రైస్ మిల్లర్లకు వీలైనంత సహాయ సహకారాలు అందించినట్లు పట్టణంలో కథనాలు బహిరంగంగానే వెలువడుతున్నాయి. ఫిర్యాదుదారులు అధికారులను మాకు ఒక శాంపిల్ ఇవ్వమని మేము కూడా ప్రైవేట్ ల్యాబ్ లో టెస్టింగులు చేయిస్తామని చట్టపరంగా అడిగినను అధికారులు దూబూచులాడడం మా 30 ఏళ్ల చరిత్రలో మమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదని ఫిర్యాదుదారున్ని గద్దించినట్లు, భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం.

దాదాపు మూడు రోజులు గడచిన తర్వాత రైస్ మిల్లులను తనిఖీ చేయడం, ఒక వింత అయితే సీఎంఆర్ కి పంపే సంచులపై మిల్లు యజమాని పేర్లు చిరునామాకు సంబంధించిన టోచన్లు లేకపోవడంతో విలేకరి అడిగిన ప్రశ్నలకు ఒక అధికారి అవసరం లేదని ఓ అధికారి ఉండాలని మొత్తం మీద రైస్ మిల్లర్లకు విశ్వాసం చూపియడంపై అధికారుల రైస్ మిల్లర్ల బాగోతం బట్టబయలు అయింది.

Related posts

పేద ప్రజల ఇండ్ల పట్టాలను తిరిగి ఇవ్వాలి

Bhavani

ఫ్లెక్సీ తొలగించమని చెప్పాం: అధికారులే బాధ్యులు

Satyam NEWS

లౌకిక వాదానికి ప్రతీక మ‌న భారత రాజ్యాంగం

Satyam NEWS

Leave a Comment