Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్యే కోవ లక్ష్మి నీచ రాజకీయాలకు నిదర్శనం ఆత్రం సుగుణ

suguna

ఆసిపాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఆడ్డుకోవడం ఎమ్మెల్యే కోవలక్ష్మి నీచ రాజకీయలకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ మండిపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.ప్రజా ప్రతినిధిగా ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని అన్నారు.జిల్లా ఇన్చార్జి మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సీతక్క వస్తే ఎమ్మెల్యే కోవలక్ష్మి స్వాగతించాల్సింది పోయి ఒక మహిళగా తల్లి లాంటి సీతక్కని కించపరచడం యావత్ మహిళ లోకాన్ని అవమానపరచడమే అని అన్నారు.జిల్లా అభివృది కొరకు అనేక సార్లు మంత్రి సీతక్క వస్తే..ఇక్కడి బారాస నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.
గత బారాస పాలనలో మంత్రులు ప్రజల సమస్యలను విస్మరించి కెసిఆర్ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతూ.. పర్సంటేజీల మంత్రులుగా కొనసాగారని విమర్శించారు. ఆదివాసి బిడ్డగా ఆదివాసుల కోసం తపించే మంత్రి సీతక్క పై పిచ్చికూతలు కూయటం మానుకోవాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై మల్లోసారి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వంపై పనికిమాలిన విమర్శలు చేస్తే ప్రజలు మిమ్మల్ని తరిమికొడతారని అన్నారు.
ప్రొటోకల్ కొరకు..రాజకీయం చేయడం సిగ్గుచేటని, ప్రజల అభివృద్ధిని అడ్డుకొవాలని చూస్తే ఖబర్దార్, మా పార్టీ కార్యకర్తలు తిరుగుబడతే… మీకు పుట్టగతులు ఉండావు అని హెచ్చరించారు.మేము పోరాట సూర్పిలో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళము,ప్రజల సాధక, బాధకాలు తెలిసిన వాళ్ళము…అందుకే..మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రతి గూడెం, పల్లె, ఊరు..వాడ.. తిరుకగుతు గ్రామాల్లో ప్రజలకు అభివృద్ది ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

కొమరం భీం ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు పై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే విరమించుకుని,క్షమాపణలు చెప్పాలని లేదంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నినాదాలు చేశారు. అనంతరం డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి పై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు.

Related posts

రైతును బెదిరించిన వినుకొండ ఎమ్మెల్యేపై చర్య తీసుకోండి

Satyam NEWS

జుక్కల్ కస్తూర్బ సిబ్బంది కి ఘనంగా సన్మానం

Satyam NEWS

మహిళలపై అత్యాచారాలకు పాలకుల వైఫల్యమే కారణం

Satyam NEWS

Leave a Comment